Bhumana Karunakar Reddy: తిరుమలలోని పరకామణిలో చోరీ జరిగిందింటూ మంత్రి నారా లోకేష్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అసత్య ఆరోపణలు చేశారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ కేసును సీఐడీతో కాదు సీబీఐతో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. రవి కుమార్ కు తమిళనాడు, కర్ణాటక, ఏపీలో ఆస్తులు ఉన్నాయి.. తమకు, మా బినామీలకు కానీ ఆస్తులు రాయించి ఉంటే సీబీఐ విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. టీటీడీ చరిత్రలో దొంగతనం చేస్తూ దొరికిన వ్యక్తి నుంచి ఆస్తులను టీటీడీ ఇప్పించిన ఘనత మాది.. కల్తీ నెయ్యి తరహాలోనే సీబీఐ విచారణకు ఈ కేసును ఇవ్వాలని భూమన తెలిపారు.
Read Also: EMRS Recruitment 2025: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 7,267 జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి
అయితే, నా హాయంలో ఈ ఘటన జరిగిందే నిజమైతే నేను అలిపిరి దగ్గర నా తల నరుక్కుంటాను అని టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం తిరుమలను రాజకీయ అడ్డగా మార్చిందన్నారు. 2023లో రవి కూమార్ అనే ఉద్యోగి పరకామణిలో 800 డాలర్లు చోరీ చేస్తూ దొరికారు.. 20 సంవత్సరాలు అతను దొంగతనం చేస్తున్నట్లు గుర్తించి పట్టుకుంది వైసీపీ ప్రభుత్వం.. రవి కుమార్ ను పట్టుకున్న తరువాత వారి కుటుంబ సభ్యులందరూ పాప పరిహారంగా చేసిన తప్పుకు ప్రతిఫలంగా రూ. 14 కోట్లు రిజిస్ట్రేషన్ వాల్యు అయితే, బయట వందకోట్ల పైవా ఉన్న ఆస్తులను టీటీడీకి కానుక ఇచ్చారని భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Solar Eclipse 2025: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. పలు దేశాలకు పొంచి ఉన్న ప్రమాదం!
ఇక, ఆ ఆస్తులను తిరుమల తిరుపతి బోర్డులో తీర్మానం చేశారని భూమన చెప్పుకొచ్చారు. అప్పుడు నేను అధ్యక్షుడిని కాదు.. విజిలెన్స్ వాళ్ళను బెదిరించి ఆ సీసీటీవీ వీడియోలను బయట పెట్టారు.. చంద్రబాబు హాయంలో జరిగిన దొంగతనం పైనా వీడియోలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే గతంలో విచారణ జరిపిన విజిలెన్స్ నివేదికను ఇప్పుడు బయట పెట్టాలని కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.