ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడ వర్గ విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి.. తాజాగా, పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే జోగారావుకు నిరసన సెగ తగిలింది.. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చెల్లమనాయుడువలసలో పర్యటనకు వెళ్లిన పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావుకు గ్రామస్తుల నుంచి నిరసన ఎదురైంది.. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి రాకుండా వైసీపీలోని మరో వర్గం అడ్డుపడింది.. అసలు గ్రామంలోకి రానివ్వకుండా ఎమ్మెల్యే జోగారావును వైసీపీలోని సర్పంచ్ వర్గీయులు అడ్డుకోవడం చర్చగా మారింది.. అయితే, అర్హులకు సక్రమంగా పథకాలు అందట్లేదని ఆందోళనకు దిగారు సర్పంచ్ వర్గీయులు.. దానికి కారణం ఎమ్మెల్యే జోగారావుగా ఆరోపణలు గుప్పించారు. కాగా, వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రజాప్రతినిధులు.. కొన్ని ప్రాంతాల్లో వారికి నిరసన తప్పడంలేదు.
Read Also: Atchannaidu: మహానాడుకు తరలివెళ్తాం.. చీమల దండులా కదులుతాం..!