రాజ్యసభ స్థానాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల దరఖాస్తు ప్రారంభంకానుంది. ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా దామోదర్‌రావు, బండి పార్థసారధిరెడ్డి రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.మరోవైపు రాజ్యసభ సభ్యుడిగా టీఆర్‌ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read Also: Kushi Movie: విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు..! క్లారిటీ ఇచ్చిన ఖుషీ టీం..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్.. విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్. కృష్ణయ్యను అభ్యర్థులుగా ప్రకటించగా… ఆ నలుగురు అభ్యర్థులు రేపు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.