Stock Market: స్టాక్ మార్కెట్‌కు బిగ్ ఫెస్టివల్.. భారీ లాభాల్లో సూచీలు
- స్టాక్ మార్కెట్‌కు బిగ్ ఫెస్టివల్
- కలిసొచ్చిన భారత్-అమెరికా ట్రేడ్ డీల్
- 18 శాతానికి సుంకం తగ్గించిన ట్రంప్
- పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం
- భారీ లాభాల్లో సూచీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్‌కు అన్ని పండుగలు ఒకేసారి వచ్చేసినట్లున్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా నూతనోత్సాహం వచ్చింది. సోమవారం భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం పెట్టుబడిదారుల్లో కొత్త సంతోషాన్ని తీసుకుంది. భారత్‌పై అమెరికా భారీగా సుంకాన్ని తగ్గించింది. 50 నుంచి 18 శాతానికి సుంకాన్ని తగ్గించింది. దీంతో ఇన్వెస్టర్లకు అన్ని ఫెస్టివల్స్ ఒకేసారి వచ్చేశాయి.
ఇది కూడా చదవండి: Nirmala Sitharaman: భారతీయ ఉత్పత్తులకు శుభవార్త.. భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌పై నిర్మలమ్మ వ్యాఖ్య
Also Read
- PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
- Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
మంగళవారం మార్కెట్ ప్రారంభం నుంచే అత్యున్నత స్థాయిలో సూచీలు లాభాల్లో దూసుకుపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 3,656 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా… నిఫ్టీ 1,219 పాయింట్ల లాభంతో 26, 308 దగ్గర కొనసాగుతోంది. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో దూసుకుపోతున్నాయి. గత కొద్దిరోజులుగా భారీ నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్… అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరడంతో పండుగ వాతావరణాన్ని తీసుచ్చింది. ఇక రూపాయి విలువ కూడా భాగా పుంజుకుంది. కొత్త ఆనందాన్ని ఇచ్చింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.04కి చేరుకుంది.
అన్ని రంగాలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. నిఫ్టీలోని అన్ని ప్రధాన రంగాల సూచీలు గ్రీన్‌లో దృఢంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియాల్టీ 4 శాతానికి పైగా లాభపడింది. ఆ తర్వాత ఆటో, మౌలిక సదుపాయాలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, లోహాలలో బలమైన కదలికలు కనిపించాయి.
బిగ్ డీల్
సోమవారం రాత్రి ట్రంప్-మోడీ మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణతో తిరిగి భారత్-అమెరికా మధ్య బంధాలు బలపడ్డాయి. ఇద్దరి నేతల మధ్య జరిగిన ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్‌పై 18 శాతం సుంకం తగ్గించినట్లుగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. రష్యా చమురు నిలిపివేతకు భారత్ అంగీకరించిందని.. ఇక భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు ఉండబోవని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య మంచి వాణిజ్య ఒప్పందాలు జరిగినట్లుగా పేర్కొన్నారు. మోడీ గొప్ప స్నేహితుడు అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇండియా టుడే మ్యాగజైన్ కవర్‌పై ఉన్న ట్రంప్-మోడీ ఫొటోను పోస్ట్ చేశారు.
ఇక భారత్‌పై 18 శాతం సుంకాలు తగ్గించినట్లుగా ట్రంప్ ప్రకటన రాగానే ప్రధాని మోడీ ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రియమైన స్నేహితుడు ట్రంప్‌తో ఈరోజు మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు ఇప్పుడు 18 శాతానికి తగ్గించబడిందని తెలుసుకుని చాలా సంతోషంగా ఉన్నాను. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజల తరపున అధ్యక్షుడు ట్రంప్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యాలు కలిసి పని చేసినప్పుడు ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. పరస్పర సహకారానికి అపారమైన అవకాశాలను తెరుస్తుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం చాలా కీలకం. శాంతి కోసం ట్రంప్ చేసే ప్రతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది. భారత్-యూఎస్ భాగస్వామ్యాన్ని అపూర్వమైన శిఖరాలకు తీసుకెళ్లడానికి ట్రంప్‌తో కలసి పని చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.’’ అంటూ మోడీ రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!