Deputy CM Pawan Kalyan: అధిక ధరలకు మద్యం విక్రయాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్
- అధిక ధరలకు మద్యం విక్రయించడంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్..
- అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధం..
- మద్యం దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు.. ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలపై ఫిర్యాదులు..
- ఫిర్యాదులపై స్పందించిన పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని తనకు ఫిర్యాదులు అందుతున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ తరహా అక్రమాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Ustaad Bhagat singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఊగిసలాట.. అందుకేనా?
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
మద్యం విక్రయాల విషయంలో దుకాణదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ఎంఆర్‌పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువగా వసూలు చేసినా సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రజలను దోచుకునేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, అధిక ధరలకు మద్యం విక్రయించే దుకాణదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, మద్యం విక్రయాల వ్యవహారంలో ఎలాంటి అక్రమాలకు తావులేదని ఉప ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!