వైసీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు.. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు ఈ ముగ్గురు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. వీరికి సీఎం బీఫాం అందజేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జగన్ పార్లమెంట్ మెట్లు ఎక్కించే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ…
మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పేర్లు ఫైనల్ చేశారు.. అయితే, ఇవాళ అధికారికంగా వైసీపీ అధిష్టానం ప్రకటించనుంది..
రాజ్యసభ స్థానాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల దరఖాస్తు ప్రారంభంకానుంది. ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా దామోదర్‌రావు, బండి పార్థసారధిరెడ్డి రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.మరోవైపు రాజ్యసభ సభ్యుడిగా టీఆర్‌ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. Read Also:…