Mukku Raju Master : ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఫిల్మ్ ఫెడరేషన్ లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ముక్కు రాజు మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వల్లభనేని అనిల్ కుమార్, టీఎఫ్‌టీడీడీ అధ్యక్షుడు జోసెఫ్ ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి దేవర శ్రీనివాస్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డాన్సర్స్ యూనియన్ ఏర్పాటు అయి 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముక్కురాజు మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షుడు జోసెఫ్ ప్రకాష్ తెలిపారు.
Also Read: Kalki 2 : ‘కల్కి-2’ విడుదల పై ఇంట్రస్టింగ్ కామెంట్ చేసిన నాగ్‌అశ్విన్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
అనంతరం ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ..‘ఈ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే మహా భాగ్యాన్ని నాకు కల్పించిన అసోసియేషన్ పెద్దలు ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాష్ గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ దేవర గారికి, ట్రెజరర్ బి. మనోహర్ గారికి, మొత్తం సభ్యులందరికీ నా వందనాలు. ఈ అసోసియేషన్ ఇంత గొప్పగా అవడానికి కారణం ముక్కురాజు మాస్టర్. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్. ఆయనలోని మానవీయకోణానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఎంతో గొప్పతనం ఉన్న మంచి మనిషి. 24 క్రాఫ్ట్ వస్తేనే ఇండస్ట్రీ అభివృద్ధి సాధ్యం. తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాలను తలదన్నే స్థాయికి వచ్చిందంటే దానికి కారణం ఇలాంటి మహానుభావులే. 24 క్రాఫ్ట్స్ ఫెరడేషన్ ఏర్పాటు కోసం 1991లో ముక్కురాజు మాస్టర్ వేసిన పునాది డ్యాన్సర్స్ అసోసియేషన్ స్థాపించడం. ఆ తర్వాత ఒక్కో యూనియన్ వచ్చాయి. నా ప్రతి సినిమాలోనూ ముక్కురాజు మాస్టర్ పని చేశారు. అందుకే నాకు ఇవాళ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం కలిగింది. అసోసియషన్‌లో ప్రస్తుతం 600 మంది డ్యాన్సర్స్ ఉన్నారంటే ముక్కురాజు మాస్టర్ వేసిన బలమైన పునాదే కారణం. సినీ పరిశ్రమలోని కార్మికులందరికీ చిత్రపురి కాలనీలో పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవిస్తున్నా’ అని తెలిపారు. అలాగే దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..
‘ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఈరోజు ఫిల్మ్ ఫెడరేషన్ లేదు. డ్యాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్ లేకుండా ఫెడరేషన్ పూర్తి అయ్యేది కాదు. ఆ టైమ్‌లో ఏ నమ్మకంతోనో ముక్కురాజు మాస్టర్ వచ్చి డ్యాన్సర్స్ యూనియన్ స్టార్ట్ చేశారు. వీళ్ల కష్టంతోనే ఇవాళ అసోసియేషన్ ఉంది. ముక్కు రాజుమాస్టర్ గారిని ప్రతి సినిమాతో ఆర్. నారాయణ మూర్తి గారు ఎంతో ఎంకరేజ్ చేశారు. అలాంటి ముక్కురాజు గారికి అసోసియేషన్ ఆఫీస్ వద్ద విగ్రహం పెట్టడం సంతోషంగా ఉంది. మన డ్యాన్సర్స్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నారు. ముక్కు రాజు మాస్టర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఈ కమిటీకి అభినందనలు’ అని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు