YS Jagan : హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
- కూటమి ప్రభుత్వంపై జగన్ ఘాటు విమర్శలు
- పోలీసు వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు
- శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న వైసీపీ అధినేత
- సోషల్ మీడియా యాక్టివిస్టులపై అణచివేత ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అత్యంత ప్రమాదకరమైన ధోరణిలో నడుస్తోందని ఆరోపిస్తూ.. “హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. చంద్రబాబు పాలనలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారని, ఇది రాజ్యాంగ హక్కులపై , ప్రజాస్వామ్య విలువలపై జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు. ఏపీకి కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యమో, జంగిల్ రాజో కాదని, ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలని జగన్ స్పష్టం చేశారు.
శాంతిభద్రతల వైఫల్యం.. నేరాలపై అలసత్వం
రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని జగన్ ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటినా ఆచూకీ కనుగొనలేకపోయారని, పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితులతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలో గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనలో వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడమే కాకుండా, బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడం దారుణమన్నారు. రాష్ట్రంలో సాయికృష్ణ లాకప్‌డెత్ , శవం మాయం కేసు, క్రాంతికుమార్ ఆత్మహత్య, గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్ వంటి ఘటనలు పోలీసు వ్యవస్థకే తలవంపులు తెచ్చాయని మండిపడ్డారు.
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
సోషల్ మీడియా యాక్టివిస్టులపై అణచివేత
ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని జగన్ ధ్వజమెత్తారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిరోజూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, సోషల్ మీడియా యాక్టివిస్టులపై బెయిల్ రాని నాన్-బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలని ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు హుకుం జారీ చేశారని ఆరోపించారు. ఉస్మానియా గోల్డ్‌మెడలిస్ట్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను హైదరాబాద్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, యూట్యూబర్ రావణ్‌కు నాలుగు కోర్టుల్లో బెయిల్ వచ్చినా అసహనంతో పోలీస్ స్టేషన్లపై దాడులు చేయించి తీవ్రవాద అభియోగాలు మోపడం దుర్మార్గమన్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చేసిన విమర్శలనే ఇప్పుడు ఇతరులు చేస్తుంటే వారిని నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారని, రాజకీయ ఆదేశాలకు కాకుండా రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థే రాష్ట్రానికి కావాలని జగన్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..