CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఏకగ్రీవ వివరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ వివరణ రాజ్యాంగ సంస్థల సమగ్రత, విశ్వసనీయతను చాటిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు సంస్థాగత విధానాలకు అనుగుణంగానే జరుగుతున్నాయని స్పష్టమైందని తెలిపారు.
SIR నిర్ణయాలు సమిష్టిగా తీసుకున్నవే
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision–SIR)కు సంబంధించిన నిర్ణయాలు ఎన్నికల సంఘం సమిష్టిగా తీసుకున్నవేనని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. సెప్టెంబర్ 26న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలతో కూడిన పూర్తి కమిషన్ సమావేశమై వివరణ ఇచ్చింది. SIR షెడ్యూల్‌కు సంబంధించిన నిర్ణయాలు కమిషన్ ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగాయని ఈసీ తెలిపింది.
Also Read
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
- AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
- YS Jagan: ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ ఫోన్.. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడతాం.. న్యాయపోరాటం చేస్తాం..
- Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
రాజకీయ ప్రయోజనాల కోసం విశ్వాసాన్ని దెబ్బతీయొద్దు
ఇక, స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య, ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించడం విచారకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం అంటే విజయాలను మాత్రమే కాకుండా పరాజయాలను కూడా హుందాగా, వినయంగా స్వీకరించడం అని అన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రజల నిర్ణయంగా గౌరవించాలని సూచించారు.
రాజ్యాంగ సంస్థలను గౌరవించడం బాధ్యత
రాజ్యాంగ సంస్థలను గౌరవించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు ఏపీ సీఎం… పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని కాపాడటం నాయకులందరి సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాల్లో సంస్థలపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ ఎక్స్ (ట్వీట్ చేశారు) లో పోస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
The unanimous clarification issued by the Election Commission, led by Chief Election Commissioner Gyanesh Kumar, alongside Election Commissioners S. S. Sandhu and Vivek Joshi, reaffirms the integrity and credibility of our constitutional institutions and puts to rest all the…
— N Chandrababu Naidu (@ncbn) September 26, 2026
తాజావార్తలు
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
-
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!