OTR: కుల సమీకరణల చుట్టూ అనంతపురం మేయర్ సీటు పాలిటిక్స్
- కుల సమీకరణల చుట్టూ అనంతపురం మేయర్ సీటు పాలిటిక్స్
- టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకు కుల పోట్లు తప్పడం లేదా?
- 8 డివిజన్స్, మేయర్ సీటు డిమాండ్ చేసిన ఆర్యవైశ్యులు
- అనుకూలమైన వారినే గెలిపించుకుంటామని వైశ్యుల వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొన్న బలిజలు, మైనార్టీలు.. నిన్న ఎస్సీలు, బీసీలు.. ఇప్పుడు ఆర్యవైశ్యులు…అనంతపురం మేయర్ పీఠం చుట్టూ… కులాల కుంపటి అంటుకుంటోందా? మేం అడిగింది ఇవ్వుంటే ఓడించి తీరతామన్న వైశ్యుల హెచ్చరికల్ని ఎలా చూడాలి? అనంత మున్సిపల్ పొలిటికల్ గేమ్ ఎలా మారుతోంది? అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండిటికీ కుల పోటు తప్పడం లేదా?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల టైం దగ్గరయ్యేకొద్దీ.. ఒక్కోచోట ఒక్కో రకమైన, రకరకాల చిత్ర విచిత్రమైన ఈక్వేషన్స్, డిమాండ్స్ తెర మీదికి వస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. మరీ ముఖ్యంగా మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పీఠాలపైనే ఫోకస్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో అనంతపురం మేయర్ సీటు కుల సమీకరణల చుట్టూ తిరుగుతోంది. మాక్కావాలంటే మాకే కావాలంటూ రోజుకో సామాజికవర్గం ప్రతినిధులు కొత్త కొత్త డిమాండ్స్ పెడుతూ ఇటు అధికార కూటమి, అటు ప్రతిపక్షం వైసీపీ నాయకుల్ని కూడా టెన్షన్ పెడుతున్నారట. తాజాగా అనంతపురం జిల్లా ఆర్యవైశ్య సంఘం చేసిన వ్యాఖ్యలు నగర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. 8 డివిజన్లతోపాటు… మేయర్ స్థానాన్ని ఆర్యవైశ్యులకే కేటాయించాలన్న డిమాండ్ మొదలైంది.
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
- OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
- OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
తమ సామాజిక వర్గాన్ని గుర్తించని ఏ పార్టీకైనా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదని, తమకు అనుకూలంగా ఉన్నవారినే గెలిపించుకుంటామన్నది ఆర్యవైశ్యుల వార్నింగ్. దీంతో లోకల్ క్యాస్ట్ ఈక్వేషన్స్ గురించి సరికొత్త చర్చ మొదలైంది. అనంతపురం మున్సిపాలిటీ… కార్పొరేషన్‌గా మారిన తర్వాత ఇక్కడి రాజకీయాల్లో స్పష్టమైన మార్పులు వచ్చాయి. మొదటిసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన రాగే పరశురాం మేయర్ కాగా… ఆ తర్వాత ఓసీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన స్వరూప ఆ పదవిలో ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీ వర్గానికి చెందిన వసీంకు మేయర్ అయ్యే అవకాశం దక్కింది. అయితే ఈసారి రిజర్వేషన్ ఎలా మారుతుంది? సీటు ఏ కోటాలో ఉంటుందన్న ఉత్కంఠ సర్వత్రా పెరుగుతోంది. మరోవైపు ఇప్పటికే అనంతపురం నగరంలోని బలిజ సామాజిక వర్గం మేయర్ పీఠంపై గట్టి ఆశలు పెట్టుకుంది. జనాభా పరంగా ఎక్కువ ఉన్న తమకు ఎమ్మెల్యే సీటు ఇవ్వటం లేదు, చివరకు మేయర్ సీటు కూడా దక్కడం లేదన్న ఆవేదన బలిజల్లో బలంగా ఉందట. అందుకే ఈసారి మాత్రం మేయర్ సీటు కచ్చితంగా తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అటు బీసీలు, మైనార్టీలు కూడా తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అలాగే… ఎస్సీ సామాజిక వర్గం నుంచి మేయర్ సీటు కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో… రిజర్వేషన్ ఎలా మారుతుంది? ఏ పార్టీ ఎవరికి ఇస్తుందంటూ రకరకాల ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో… తాజాగా ఆర్యవైశ్యులు 8 డివిజన్స్తో పాటు మేయర్ సీటు కోసం డిమాండ్ చేయడం, రాష్ట్ర స్థాయి నేతలను కలుస్తామని ప్రకటించడం చర్చనీయాంశమైంది. అయితే…. అనంతపురం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే కుల సమీకరణలు మాత్రమే సరిపోవన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అంతకుమించిన ఆర్థిక బలం కూడా ఉండాలంటున్నారు. ఈసారి మేయర్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగబోతున్నందున ఖర్చు కూడా బాగానే పెరగవచ్చంటున్నారు. నగర వ్యాప్తంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి దాదాపు ఒక ఎమ్మెల్యే సీటుకు పోటీ చేసినంత కసరత్తు అవసరం అవుతుంది.
ఈ ఎన్నికల వ్యయాన్ని తట్టుకుని, ఆర్థికంగా ధీటుగా నిలబడగలగడం అందరికీ సాధ్యం అవకపోవచ్చని మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఆ లెక్కన చూస్తే…. ఖర్చు భరించే సామర్థ్యం ఉన్న ఆర్యవైశ్యులు, ఈసారి 8 డివిజన్స్, మేయర్ టిక్కెట్ తమకే కావాలని పంతం పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ సామాజిక వర్గం నుంచి పోటీ చేసే వారికి ఆర్థికంగా పూర్తి తోడ్పాటు అందిస్తామని ఆర్యవైశ్య సంఘం బహిరంగంగానే ప్రకటించింది. ఒకవైపు కులాల పట్టుదల, మరోవైపు అభ్యర్థుల ఆర్థిక స్థోమతను బేరీజు వేసుకోవడం ఇప్పుడు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతోందట. రోజు రోజుకీ ఈ రకంగా కులాల డిమాండ్స్ ఎక్కువ కావడంతో కూటమితో పాటు వైసీపీకి కూడా రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఇలాంటి వాతావరణంలో ఆ టైం వచ్చేసరికి పరిస్థితులు ఎలా మారతాయోనని ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.
తాజావార్తలు
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!