IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుండగా, అరగంట ముందు టాస్ వేస్తారు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తుది జట్టు (ప్లేయింగ్ ఎలెవన్) వివరాలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఇచ్చిన సంకేతాల ప్రకారం రోహిత్ శర్మ, కెప్టెన్ శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని తేలింది. యశస్వి జైస్వాల్ వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగడం ఖాయం కాగా, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో రుతురాజ్ గైక్వాడ్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడటం లాంఛనమే.
Also Read
- Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
- BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
- WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
- Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
ఇక ఆల్ రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి జట్టులో స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో స్పిన్ బాధ్యతలను కుల్దీప్ యాదవ్ మోయనున్నారు. భారత పరిస్థితులను బట్టి ఇద్దరు పేసర్లుగా ప్రసిద్ధ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తుది జట్టులో చోటు దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్‌ల ద్వారా అందిన సమాచారం.. బీసీసీఐ దాదాపుగా ఈ తుది జట్టుపైనే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.
టీమిండియా జట్టు (అంచనా): రోహిత్ శర్మ, శుభమన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, లోకేష్ రాహుల్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ, గుర్నూర్ బ్రార్.
మొత్తం జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, నమన్ ధీర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
స్వదేశంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో విజయంతో బోణీ కొట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు రాణించి, రాబోయే సిరీస్‌లపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. తిరువనంతపురం వేదికగా జరిగే ఈ సమరంపై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగుతున్న భారత్, విండీస్‌ను ఏ విధంగా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. మొదటి వన్డే విజయం ద్వారా సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి.
తాజావార్తలు
-
Prabhas Birthday Special : డార్లింగ్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇదొక్కటేనా?
-
YSRCP : వైసీపీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత
-
Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
-
Hyderabad: రూ.16 కోట్ల చిట్టీల మోసం.. ప్రధాన నిందితురాలు సీత అరెస్ట్
-
Legendary Singer Biopic: ఆ లెజెండరీ సింగర్ కథతో రెహమాన్ సినిమా.. నిజమేనా?
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!