Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ జిజి థామ్సన్ ఆరోపణ
- 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆఫర్ చేశారన్న వాదన
- 2016లో ఢిల్లీకి విమాన ప్రయాణంలో ఈ ప్రతిపాదన వచ్చిందని వెల్లడి
- పథనంతిట్ట నుంచి పోటీ చేయాలని సూచించారని థామ్సన్ ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanesh Kumar: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ, ఆయన రాజీనామాను కోరుతున్నాయి. ఇదిలా ఉంటే, 2019లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలని తనకు జ్ఞానేష్ కుమార్ సూచించారని మాజీ కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిజి థామ్సన్ ఆరోపించారు. 2016లో ఢిల్లీ విమాన ప్రమాణ సమయంలో తనకు ఈ ప్రతిపాదన వచ్చిందని, అయితే తాను ఈ ప్రతిపాదనను తిరస్కరించానని థామ్సన్ చెప్పారు.
జ్ఞానేష్ కుమార్ తనకు స్నేహితుడని చెప్పిన థామ్సన్.. రిటైర్ అయిన తర్వాత తన భవిష్యత్ ప్రణాళిక గురించి అడిగారని, అందుకు తాను పిల్లల కోసం ఒక ప్రాజెక్ట్‌పై పనిచేయాలని భావిస్తున్నట్లు చెప్పానని వెల్లడించారు. అయితే, జ్ఞానేష్ కుమార్ మాత్రం పథనంతిట్ట నుంచి బీజేపీ తరఫున లోక్‌సభకు పోటీ చేసి ఎంపీగా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఎదగవచ్చని సూచించినట్లు థామ్సన్ పేర్కొన్నారు. వెంటనే తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు చెప్పారు.
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
ఈ ఘటన జరిగిన సమయంలో జ్ఞానేష్ కుమార్ ప్రభుత్వ సర్వీసులోనే ఉన్నారు. థామ్సన్ 1988 బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి. 2024 జనవరిలో సర్వీస్ నుంచి రిటైరయ్యారు. థామ్సన్ ప్రస్తుతం వ్యాఖ్యలు ప్రస్తుతం ఎన్నికల సంఘంపై రాజకీయ వివాదం నెలకొన్న తరుణంలో వచ్చాయి. ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు నివేదిక వచ్చిన నేపథ్యంలో, జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
థామ్సన్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. జ్ఞానేష్ కుమార్ అప్పట్లో బీజేపీకి అభ్యర్థులను రిక్రూట్ చేయడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా పోస్టులో.. ‘‘అప్పటి ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్‌ను బీజేపీ కోసం నియామకాలకు ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత మోడీ, షా అతడిని ఎంపైర్‌గా చేసి, భారత ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు బాధ్యుడిగా నియమించారు’’ అని ఆరోపించారు.
First, Gyanesh Kumar – then a serving IAS officer – was used to recruit for the BJP.
Then Modi and Shah made him the umpire and put him in charge of match-fixing India's elections. https://t.co/hvdhEfoVgg
— Rahul Gandhi (@RahulGandhi) September 26, 2026
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!