Vijaya Sai Reddy: ఆర్.ఆర్.ఆర్ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ సాధిస్తుంది..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Sai Reddy: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. హాలీవుడ్ మీడియా సైతం ఆర్.ఆర్.ఆర్ మూవీని కీర్తిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆర్.ఆర్.ఆర్ మూవీని కొనియాడుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘RRR చిత్రం హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉండొచ్చన్న హాలీవుడ్ మ్యాగజైన్ అంచనాలు మన తెలుగు చిత్ర స్థాయిని చాటిచెబుతున్నాయి. గిరిపుత్రులు బ్రిటిష్ వారిపై జరిపిన పోరాటమే ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రం ఖచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నా’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Maharashtra: ప్రభుత్వం చేయలేని పని.. 19 ఏళ్ల యువతి చేసింది..!!
Also Read
- CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
కాగా ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ ‘వెరైటీ’ ఇటీవల ఆర్.ఆర్.ఆర్ మూవీపై ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ సినిమా పలు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లను పొందే అవకాశం ఉందని తన కథనంలో పేర్కొంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గీతం కేటగిరీల్లో ఆర్.ఆర్.ఆర్ మూవీ పోటీ పడొచ్చని హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ పేర్కొంది. కాగా ఈ ఏడాది మార్చిలో బిగ్ స్క్రీన్లపై సందడి చేసిన ఆర్.ఆర్.ఆర్ సినిమా.. ఆ తరువాత ఓటీటీ, బుల్లితెరపైనా అదరగొట్టింది. దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ మూవీలో అద్భుత నటన ప్రదర్శించినందుకు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లలో ఒక్కరికైనా ఆస్కార్ అవార్డు రావాలని టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
RRR చిత్రం హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకొంది. ఆస్కార్ బరిలో Jr.NTR, రామ్ చరణ్ ఉండొచ్చన్న హాలీవుడ్ మ్యాగజైన్ అంచనాలు మన తెలుగు చిత్ర స్థాయిని చాటిచెబుతున్నాయి. గిరిపుత్రులు బ్రిటిష్ వారిపై జరిపిన పోరాటమే ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రం ఖచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నా. pic.twitter.com/K4DFonbQQS
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 18, 2022
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..