Vijay Sai Reddy: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. హాలీవుడ్ మీడియా సైతం ఆర్.ఆర్.ఆర్ మూవీని కీర్తిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆర్.ఆర్.ఆర్ మూవీని కొనియాడుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘RRR చిత్రం హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్…