Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panama Earthquake: మధ్య అమెరికా దేశమైన పనామాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం దక్షిణ పనామా ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపం ధాటికి రాజధాని పనామా సిటీలో భవనాలు కంపించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ఈ ప్రకంపనలు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నమోదయ్యాయి.
అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ (యూఎస్జీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం.. పనామా దక్షిణ ప్రాంతంలోని పిటాలోసా అరిబాకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పాటు విమాన సర్వీసులను సైతం నిలిపివేశారు.
Also Read
భూకంపం అనంతరం వరుసగా డజనుకు పైగా ప్రకంపనలు (ఆఫ్టర్‌షాక్స్) సంభవించడంతో ప్రజల్లో భయం మరింత పెరిగింది. చాలా సేపటి వరకు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. పలు ప్రావిన్సుల్లో అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. భూకంపం ప్రభావంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని యూఎస్జీఎస్ హెచ్చరించినప్పటికీ.. నష్టం పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
భూకంపం ధాటికి ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైనే గడిపారు. సోషల్ మీడియాలో కనిపించిన వీడియోలలో వృద్ధులు భయంతో కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. ముఖ్యంగా హెరెరా ప్రావిన్స్‌లో భవనాలు దెబ్బతినడంతో అవి ఎక్కడ కూలిపోతాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భూకంపం కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు, నష్టంపై అంచనాలు కొనసాగుతున్నాయి. వరుస ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Panama Earthquake at Some Points
#earthquake #Terremoto #panama #sismo #temblor https://t.co/KKRXNTHyVU— Parveen Kumar (@Parveen45427473) October 9, 2026
తాజావార్తలు
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు