AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ అత్యవసరంగా సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశాలపై కేబినెట్లో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల ఖరారు, తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
బీసీలకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపైనా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై కూడా సమావేశంలో సమాలోచనలు జరగనున్నట్లు సమాచారం. న్యాయపరమైన పరిణామాల నేపథ్యంలో ఈ జీవోలను రద్దు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన మార్గాలపై కేబినెట్ కసరత్తు చేయనుంది. బీసీ రిజర్వేషన్లను ఎలా ఖరారు చేయాలి? సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎన్నికల నిర్వహణకు సంబంధించి తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి? అనే అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
తాజావార్తలు
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!