How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How to Get Rid of Lizards at Home: ఇంట్లో గోడలపై బల్లులను చూడగానే కొందరికి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా, ఇవి వంట గదిలో వంటకాలపై పడుతుంటాయనే టెన్షన్ అందరికీ ఉంటుంది. ముఖ్యంగా రాత్రిపూట లైట్ వేయగానే గోడలపై బల్లులు పరుగులు పెట్టడం చూస్తే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. ఇవి మనుషులకు నేరుగా పెద్దగా హాని చేయకపోయినా, వీటి ఉనికి మాత్రం మనల్ని ఎప్పుడూ ఒక రకమైన అభద్రతా భావానికి గురిచేస్తుంటుంది. అయితే, మీ ఇంట్లో నుంచి బల్లులను తరిమికొట్టడానికి కొన్ని సింపుల్ చిట్కాలు బాగా పనిచేస్తాయి. అసలు బల్లులు ఇంట్లోకి ఎందుకు వస్తాయో తెలుసుకుంటే సగం సమస్య అక్కడే తీరిపోతుంది. ఇంట్లోని చిన్న చిన్న కీటకాలు, దోమలు, ఈగలు, బొద్దింకలను తినడం కోసమే బల్లులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ముందుగా ఇంట్లో కీటకాలు పెరగకుండా చూసుకోవాలి. వంటను ఎప్పుడూ మూతపెట్టి ఉంచడం, డస్ట్ బిన్ను తెరిచి ఉంచకుండా ఎప్పటికప్పుడు చెత్తను బయటపడేయడం ద్వారా కీటకాలను తగ్గించవచ్చు. కీటకాలు లేకపోతే బల్లులు కూడా అటోమేటిక్‌గా రావడం మానేస్తాయి.
అలాగే బల్లులు చాలా చిన్న సందుల నుంచి కూడా ఇళ్లలోకి సులభంగా చొరబడగలవు. కాబట్టి కిటికీలు, తలుపులు, పైపుల చుట్టూ లేదా గోడలపై ఉండే పగుళ్లను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. తలుపుల కింద ఎక్కువ ఖాళీ ఉంటే డోర్ సీల్స్ లేదా వెదర్ స్ట్రిప్స్ అమర్చుకోండి. గోడలు, కిటికీల పగుళ్లను సీలెంట్స్ తో బ్లౌక్ చేస్తే బల్లులతో పాటు చిన్న పురుగులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇక నాఫ్తలీన్ బాల్స్ లేదా మోత్ బాల్స్ నుంచి వచ్చే తీవ్రమైన వాసన బల్లులను, ఇతర కీటకాలను దూరం చేయడానికి సహాయపడుతుంది. కాకపోతే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం వీటిని చాలా జాగ్రత్తగా వాడాలి, వీలైనంత వరకు వీటి వినియోగాన్ని తగ్గించడమే మంచిది. మన దేశంలో బల్లులను తరిమికొట్టడానికి ఎగ్ షెల్స్ (గుడ్డు పెంకులు) పెట్టడం ఒక పాత పద్ధతిగా వస్తోంది. ఈ పెంకుల వాసనకు లేదా వాటిని చూసి ఏదో పెద్ద జీవి ఉందనే భ్రమతో బల్లులు ఆ దరిదాపుల్లోకి రావని నమ్ముతారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నప్పటికీ, ఒక సాధారణ ఇళ్లల్లో పాటించే చిట్కాగా దీన్ని ట్రై చేసి చూడొచ్చు.
Also Read
- Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
- Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
- Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
- How to Make Besan at Home: ఇక మార్కెట్లో కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే స్వచ్ఛమైన శనగపిండి తయారు చేసుకోండిలా..
ఇవే కాకుండా ఫర్నీచర్ వెనుక, స్టోర్ రూమ్, పాత డబ్బాలు, కర్టెన్ల వెనుక భాగం వంటి ఎవరికీ కంటికి కనిపించని ప్రదేశాల్లో బల్లులు ఎక్కువగా ఆశ్రయం పొందుతుంటాయి. అందుకే ఇంటి మూలలను రోజూ శుభ్రం చేసుకోవడం, చాలా కాలంగా పడేయకుండా ఉంచిన పనికిరాని వస్తువులను, అట్టపెట్టెలను ఎప్పటికప్పుడు ఇంటి నుంచి బయటకు పంపేయడం చాలా ముఖ్యం. రాత్రి వేళల్లో ఎలాంటి అవసరం లేకుండా కిటికీలను తెరిచి ఉంచకండి, ఎందుకంటే కిటికీల గుండా లోపలికి వచ్చే పురుగుల కోసమే ట్యూబ్ లైట్ల దగ్గర బల్లులు ఎక్కువగా తిరుగుతుంటాయి. మొత్తంగా చెప్పాలంటే, ఇంట్లో బల్లులు పదే పదే కనిపిస్తుంటే కేవలం వాటిని తరిమేయడం వల్ల మాత్రమే సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. ముందుగా ఇంట్లోని కీటకాలను తగ్గించడం, కిటికీలు-తలుపుల దగ్గర ఉండే పగుళ్లను సరిచేయడం, బల్లులు దాక్కునే మూలలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ చిన్న చిన్న మార్పులు పాటిస్తే మీ ఇంట్లోకి బల్లులు రాకుండా సులభంగా అడ్డుకోవచ్చు.
తాజావార్తలు
-
Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
-
Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
-
Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
-
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
-
AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?