Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Rathee: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఢిల్లీకి వచ్చారు. అయితే, గురుగ్రామ్ సెక్రటరీ 56లోని సెంట్రల్ పార్క్ విహార్లో ఉన్న ఆయన కుటుంబ నివాసంలోకి శుక్రవారం అర్ధరాత్రి నుంచే సుమారు 50 మంది పోలీసులు మోహరించారు. చివరకు శనివారం ఉదయం 7:48 గంటలకు రాఠీ తల్లి తలుపు తీయడంతో పోలీసులు లోపలికి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసనను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో దాదాపు లాక్డౌన్ లాంటి పరిస్థితులు సృష్టించిందని ధ్రువ్ రాఠీ ముందుగానే మండిపడ్డారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రి ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. మా ఆందోళనను అడ్డుకోవడానికి ఏకంగా 50కి పైగా మెట్రో స్టేషన్లను మూసివేశారని, రైళ్లు, బస్సులను రద్దు చేశారని, ఢిల్లీని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మా ప్రొటెస్ట్కి ఎవరూ రారని మీ ఐటీ సెల్లే చెబుతోంది కదా, మరి అంత భయమెందుకు? జనం రారన్నప్పుడు ఇన్ని ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. మీరు నిజంగానే భయపడుతున్నారని, దేశ ప్రజలంతా ఇప్పుడు మేల్కొన్నారని పేర్కొంటూ.. ప్రజలందరూ అక్టోబర్ 10న జంతర్ మంతర్ నిరసనకు తరలిరావాలని ఆ వీడియోలో పిలుపునిచ్చారు.
Also Read
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
మరోవైపు, ఈ నిరసనను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలకమైన మెట్రో స్టేషన్లతో పాటు మార్కెట్లను కూడా మూసివేశారు. ఢిల్లీకి వచ్చే డజన్ల కొద్దీ రైళ్లను రద్దు చేయడంతో పాటు, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాకుండా, నిరసనకారులు ఎవరూ ఢిల్లీకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఇటువంటి కట్టుదిట్టమైన భద్రతా వలయాల మధ్యే ధ్రువ్ రాఠీని పోలీసులు అరెస్ట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!