West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Highest Successful T20I Run Chases List in T20: భారత్‌పై వెస్టిండీస్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం రాత్రి రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో కెప్టెన్ షాయ్ హోప్ (102) అజేయ శతకంతో చెలరేగడంతో కరీబియన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 250 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. టీమిండియా భారీ స్కోరు చేసినప్పటికీ.. బౌలింగ్‌లో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇక భారత్‌పై టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఇదే అత్యధిక విజయవంతమైన ఛేదనగా నిలిచింది.
ఈ విజయంతో పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక లక్ష్యాలను ఛేదించిన జట్ల జాబితాలో వెస్టిండీస్ రెండో స్థానానికి చేరింది. 2023లో దక్షిణాఫ్రికాపై సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు భారత్‌పై 250 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన వెస్టిండీస్.. ఈ రెండో స్థానంలో నిలిచింది. 2018లో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 244 స్కోరును 2025లో బల్గేరియా జట్టు జిబ్రాల్టర్‌పై సోఫియాలో ఛేదించింది.
Also Read
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
- MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక లక్ష్య ఛేదనల జాబితాలో పసికూన బల్గేరియా కూడా ఉంది. 2022లో సెర్బియాపై బల్గేరియా 243 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. 2015లో జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగా, 2016లో ముంబైలో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ 230 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా అందుకుంది. ఇప్పటివరకు వెస్టిండీస్ అత్యధిక లక్ష్య ఛేదన 232గా ఉండగా.. తాజాగా పటిష్ట భారత్‌పై 250 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది. విండీస్ ఊపు చూస్తే.. లక్ష్యం ఇంకా పెద్దదయితే దక్షిణాఫ్రికా రికార్డు కూడా బద్దలయ్యేదే.
పురుషుల అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక ఛేజింగ్ లిస్ట్ ఇదే:
259 – దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్, సెంచూరియన్, 2023
250 – వెస్టిండీస్ vs భారత్, రాంచీ, 2026
244 – ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, ఆక్లాండ్, 2018
244 – బల్గేరియా vs జిబ్రాల్టర్, సోఫియా, 2025
243 – బల్గేరియా vs సెర్బియా, సోఫియా, 2022
232 – వెస్టిండీస్ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 2015
230 – ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా, ముంబై WS, 2016
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!