CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 40 లక్షల 58 వేల పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా.. నర్సింగోలు గ్రామ సభలో కొత్తపల్లి బాలమ్మ అనే మహిళా రైతుకి పట్టాదారు పాసు పుస్తకం అందజేసిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. అక్టోబర్‌లోనే 793 గ్రామాల్లో 4 లక్షల 58 వేల మందికి పాసుపుస్తకాలు అందించామని తెలిపారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 24,116 పాసుపుస్తకాలు పంపిణీ చేసినట్లు వివరించారు. నవంబర్ నుంచి మార్చి 27 వరకు మరో 7,789 గ్రామాల్లో 51 లక్షల 91 వేల మందికి పాసుపుస్తకాలు అందించాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారులకు టార్గెట్లు ఇచ్చినట్లు తెలిపారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోతే కలెక్టర్లు, సంబంధిత శాఖలు, మంత్రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనలో వేగం మరింత పెంచానని చంద్రబాబు అన్నారు. గతంలో తాను పనిచేసిన విధానానికి, ప్రస్తుతం పనిచేస్తున్న తీరుకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. 1995లో ఉన్న తన పనివేగం కంటే ఇప్పుడు మరింత వేగంగా ముందుకు సాగుతున్నామని వ్యాఖ్యానించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.. పేద కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మంది నిరుపేదలకు ప్రతి నెలా ఒకటో తేదీన చంద్రన్న వారి ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నట్లు వివరించారు. అర్హతను బట్టి రూ.4,000, రూ.6,000, రూ.10,000, రూ.15,000 పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ఒక్క పైసా అవినీతి లేకుండా, లబ్ధిదారులకు గౌరవప్రదంగా పింఛన్లు అందించాలనే ఉద్దేశంతో స్వయంగా తానే పంపిణీలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
మహిళలు, పిల్లల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు అన్నారు. ‘తల్లికి వందనం’ పథకం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. అడ్డదారుల్లో కాకుండా నిబంధనల ప్రకారం పథకాల ప్రయోజనాలు పొందాలని సూచించారు. మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించామని సీఎం వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే 100 కోట్ల ప్రయాణాలు పూర్తయ్యాయని తెలిపారు. పేదలకు సంక్షేమం అందించడం, మహిళలకు ఆర్థికంగా అండగా నిలవడం, రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించడం వంటి కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యాల ప్రకారం వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!