AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేసింది.
Midhun Reddy: అమరావతిలో మద్యం స్కాం (లిక్కర్ కేసు) సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరపనుంది. సిట్ (Special Investigation Team) హైకోర్టులో కీలక కౌంటర్ దాఖలు చేసింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను తిరస్కరించాలని కోరుతూ, ఆయనపై పలు ఆరోపణలు చేసినట్లు సమాచారం. సిట్…
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతి రోజు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సెటైర్ వేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిజమే గెలిచిందని అంటున్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ . నారా భువనేశ్వరి నిజం గెలవాలని యాత్ర చేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టు అయితే చనిపోయింది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు.
VijayaSaiReddy: వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరో కీలక పదవి దక్కించుకున్నారు. రవాణా, సాంస్కృతిక, పర్యాటక శాఖలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీకి ఆయన ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ హోదాలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ సాయిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ కమిటీలో ఉపరితల రవాణా, పౌర విమానయానం, నౌకాయానం, పర్యాటకం, సాంస్కృతిక శాఖలకు…
Vijay Sai Reddy: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. హాలీవుడ్ మీడియా సైతం ఆర్.ఆర్.ఆర్ మూవీని కీర్తిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆర్.ఆర్.ఆర్ మూవీని కొనియాడుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘RRR చిత్రం హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్…
Andhra Pradesh: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా ఏపీలోని నెల్లూరులో తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో 25 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులోని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన ఓ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ గదిలో భారీగా రికార్డులను గుర్తించిన అధికారులు.. ఆ గది తాళాన్ని…
Vijaya Sai Reddy: రాజ్యసభలో మంగళవారం నాడు కీలక చర్చ నడించింది. కార్పొరేట్ కంపెనీల ట్యాక్స్ ఎగవేతపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వానికి కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు ఎగవేస్తున్నందున దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటో వివరించాలని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ సంస్థలైన డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్),…
రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సెల్‌ఫోన్ చోరీకి గురైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పర్యటనలో ఎంపీ మార్గాని భరత్ పాల్గొనగా.. ఆయన ఫోన్‌ను దుండగులు కొట్టేసినట్లు తెలుస్తోంది. తన ఫోన్ చోరీకి గురైందన్న విషయంపై ఎంపీ భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరగా రాజమండ్రి ఎయిర్‌పోర్టులోని హెర్బల్ షాపులో పని చేసే యువతితో ఆయన తన ఫోన్‌తో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఫోన్ కనిపించలేదని ఎంపీ భరత్ వివరించారు. ఎంపీ వ్యక్తిగత…