విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే అసమ్మతి సెగ ఎదురైంది. పాయకరావుపేట మండలం రాజవరం గ్రామంలో మంచినీటి పైపులైన్ ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యే గొల్ల బాబూరావును వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జగన్ ముద్దు- ఎమ్మెల్యే వద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యే కారుకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఎమ్మెల్యే మద్దతుదారులు, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
Read Also: మొరాయించిన రవాణాశాఖ సర్వర్.. ట్యాక్స్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి
దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్యేను భారీ భద్రత మధ్య పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. కాగా సొంత పార్టీ కార్యకర్తలే తనను అడ్డుకోవడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. ఈ పరిణామం విశాఖ జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.