విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే అసమ్మతి సెగ ఎదురైంది. పాయకరావుపేట మండలం రాజవరం గ్రామంలో మంచినీటి పైపులైన్ ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యే గొల్ల బాబూరావును వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జగన్ ముద్దు- ఎమ్మెల్యే వద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యే కారుకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఎమ్మెల్యే మద్దతుదారులు, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. Read…