Wife Shivani Killed Her Husband Ramesh With Help Of Lover In Vizag: వివాహేతర సంబంధాల మోజులో కొందరు మహిళలు బరితెగించేస్తున్నారు. పాడుపని చేయడమే కాకుండా.. కట్టుకున్న భర్తలనే అన్యాయంగా చంపేస్తున్నారు. ఇప్పుడు వైజాగ్‌లోనూ ఇలాంటి దారుణ ఉదంతమే వెలుగు చూసింది. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వివాహిత.. కానిస్టేబుల్ అయిన తన భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది. మరింత ఘోరం ఏమిటంటే.. తన భర్తని ప్రియుడు చంపుతుండగా, దాన్ని భార్య తన ఫోన్‌లో రికార్డ్ చేయడం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
2 Rupees Bribe: 2 రూపాయల లంచం.. 37 ఏళ్ల సుదీర్ఘ విచారణ.. చివరికి తుది తీర్పు ఏంటంటే?
విశాకలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రమేష్ అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం శివానితో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే.. గత కొంతకాలం నుంచి శివారి రామారవు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి ఖంగుతిన్న రమేష్.. భార్యని మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. తన ప్రియుడు రామారావుతో కలిసి రాసలీలలు కొనసాగించింది. దీంతో లోలోపలే కుంగిపోయే రమేష్.. మద్యానికి బానిస అయ్యాడు. ఏం చేయాలో తెలియక లోలోపలే కుమిలిపోయాడు. అటు.. శివాని తన భర్తను చంపి, ప్రియుడితో కలిసుండాలని ప్లాన్ వేసింది. భర్తని చంపి.. వరకట్న సమయంలో రమేష్‌కి ఇచ్చిన అరకరం అమ్మేసి, ప్రియుడితో కలిసి సెటిల్ అవుదామని భావించింది.
Mamata Banerjee: అమిత్ షా చెప్పింది కరెక్టే.. బిగ్ షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ
నీలా అనే వ్యక్తికి రూ.2 లక్షల సుపారీ ఇచ్చి.. రమేష్‌ను చంపేందుకు శివాని, రామారావు కలిసి ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం.. శివాని తన భర్తకు మత్తు ట్యాబ్లెట్స్ ఇచ్చింది. అవి వేసుకున్న తర్వాత రమేష్ గాఢ నిద్రలోకి జారిపోయాడు. అప్పుడు ప్రియుడు, నీలా కలిసి తలదిండు మొహానికి అడ్డుపెట్టి చంపేశారు. భర్తను చంపే సమయంలో శివాని తన ఫోన్‌లో వీడియో తీసింది. అనంతరం తనకేమీ తెలియదన్నట్టు డ్రామా ఆడింది. కాల్‌డేటా, వాట్సాప్ చాట్ ఆధారంగా లోతైన దర్యాప్తు చేయగా.. భార్యే హంతకురాలని పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధం కోసమే భర్తని చంపినట్టు శివాని ఒప్పుకుంది. శివాని తల్లిదండ్రుల మీద కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.