Minister Anitha: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత పులివెందుల, ఒంటిమిట్ట జెడ్‌పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బాబాయ్‌ను చంపిన వారికి ఓటు వేయాలా? తల్లికి, చెల్లికి ఆస్తి పంచకుండా కోర్టుకు వెళ్లిన వ్యక్తికి ఓటు వేయాలా? అంటూ ప్రశ్నించారు. అలాగే మంత్రి అనిత మాట్లాడుతూ.. పులివెందులలో ఎన్నికలు ఎప్పుడూ భయపెట్టి, ఏకపక్షంగా జరిపే చరిత్ర ఉందని ఆమె పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌ల మార్పు నిర్ణయం ఎన్నికల కమిషన్‌దే తప్ప ముఖ్యమంత్రిది…
నేను చంద్రబాబుకి ఏక లవ్య శిష్యురాలిని అంటూ హోంమంత్రి అనిత తెలిపింది. ఆయనను చూసి నేను నేర్చుకున్నాను.. రాబోయే తరానికి కూడా ఆయన స్ఫూర్తిదాయకం.. ఆంధ్రప్రదేశ్ ను 2047కు అగ్రగామిగా ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. బంగారు కుటుంబంతో ప్రజలతో ఎంతో మంచి చేస్తున్నారు.
Home Minister Anitha: విజయనగరంలోని రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఇక, స్త్రీ నిధీ చెక్కును మహిళలకు మంత్రి అందజేసింది.
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మను వరుసగా కేసులు వెంటాడుతున్నాయి.. తాజాగా కడపలో.. అనకాపల్లిలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి.. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు.
శాసన మండలి నుంచి మళ్లీ మళ్లీ వాకౌట్ చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.. శాసన మండలిలో వైసీపీ ఇచ్చిన ఇసుక కొరత, భవన కార్మికుల కష్టాలపై వాయిదా తీర్మానం, అగ్రిగోల్డ్ బాధితులపై పీడీఎఫ్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు ఛైర్మన్.
పులివెందుల ఎమ్మెల్యే నోటి నుంచీ వినకూడని మాటలు వస్తున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. రాజకీయాలలో ఎవరున్నా.. మా కుటుంబ సభ్యులను సైతం నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి మహిళా రైతులు మానసిక క్షోభకు గురయ్యారన్నారు.
గతంలో హోంమంత్రిపై పవన్ వ్యాఖ్యలు అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు – పోలీసుల రియాక్షన్‌పై పవన్ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన పవన్ తాను హోంమంత్రి అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయని ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,…
ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో పెట్టండి.. అధికారులకు సర్కార్ ఆదేశం ప్రభుత్వం ఫైనల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని సర్కార్ ఆదేశించింది. అక్టోబర్ 7వ తేదీ లోపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో ఏర్పాటు చేయాలని తెలిపింది. జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో నమూనాను కూడా విడుదల చేస్తూ.. ప్రభుత్వం కార్యాలయాల్లో సీఎం పెట్టాలని తెలిపింది. ఇప్పటికే…
ఈ రోజు హోం శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశానికి హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమల రావు, హోంశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా.. 2014-19తో పోల్చితే 2019-24 మధ్య క్రైం రేటు 46. 8 శాతం పెరిగిందని సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు.. మహిళలపై నేరాలు 36 శాతం, పిల్లలపై క్రైం 152 శాతం, మిస్సింగ్ కేసెస్ 84 శాతం, సైబర్ క్రైం నేరాలు 134…
భక్తులకు శుభవార్త.. విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు ఆలయ నిర్వహాకులు శుభవార్త తెలిపారు. సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ కొండపైనున్న విష్ణు పుష్కరిణిలో భక్తులకు సంకల్ప స్నానం ఆచరించే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రావణ మాసం మొదటి ఆదివారం యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య చేతుల మీదుగా అధికారులు విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించారు. ఆలయ అధికారులు…