Tuk Tuk : ఏఐ టెక్నాలజీతో సినిమా సాంగ్ షూట్.. ఏ సినిమాలో అంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్యున్నత సాంకేతిక పరిజ్క్షానంతో మన సినిమాలు కూడా హాలీవుడ్ సినిమాలతో పోటీపడుతున్నాయి. ప్రేక్షకులు కంటెంట్‌తో పాటు తమను అబ్బురపరిచే సాంకేతిక పరిజ్క్షానం వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. అందుకే మన దర్శక నిర్మాతలు ఎప్పటికప్పుడూ కొత్త సాంకేతిక పరిజ్క్షానంను మన సినిమాల్లో వాడుతుంటారు. తాజా ఇలాంటి ఓ సరికొత్త ప్రయోగం చేసింది టుక్ టుక్ చిత్ర టీమ్. తొలిసారిగా ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో సినిమాకు సంబంధించిన ఓ పాటను చిత్రీకరించారు. ఇది ఇండియన్ సినిమాలోనే తొలిసారి.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
‘ఏలా అల తీపికోరే పూలతోట’ అనే కొనసాగే ఈపాట విజులవ్స్ ఏఐ టెక్నాలజీతో ఎంతో అందంగా, స్టనింగ్ విజువల్స్ తో దర్శకుడు సుప్రీత్ కృష్ణ సాహిత్యం అందించిన పాటకు సంతు ఓంకార్ స్వరాలు అందించారు. ఏఐ ఈ పాటను బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేసింది. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్. దర్శకుడు మాట్లాడుతూ ‘ఏ ఐ టెక్నాలజీతో పాటను చిత్రీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. తప్పకుండా థియేటర్‌లో ఆడియన్స్ ఈ పాటను ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి టెక్నాలజీని సినిమాల్లో తొలిసారిగా మా సినిమాకు వాడటం గర్వంగా ఉంది. సినిమా కూడా ఓ న్యూకాన్పెప్ట్‌లో ఉంటుంది. ఫాంటసీతో పాటు కొన్ని మ్యాజికల్ ఎలిమెంట్స్ చిత్రంలో ఉంటాయి. అవి ఆడియన్స్‌కు థ్రిల్ల్‌ను కలిగిస్తాయి. ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న ఈ చిత్రం అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..