మానవ సంబంధాలలో కక్షలు, కార్పణ్యాలు, అయినవారి హత్యలు పెరిగిపోతున్నాయి. తమ సుఖం కోసం డబ్బుకోసం ఏ పని చేయడానికైనా అటు మహిళలు, ఇటు స్త్రీలు వెనుకాడడం లేదు. భార్య అడ్డు తొలగించుకోవడానికి భర్త, భర్తను ఎలాగైనా చంపేందుకు భార్య కుటిల ప్లాన్ లు వేస్తున్నారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను పాశవికంగా చంపేస్తున్నారు. విశాఖలో ఇలాంటి ఘోరం జరిగింది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందో ఘటన.
ప్రియుడితో కలిసి భర్తను భార్యే అత్యంత కిరాతకంగా హత్యచేసినట్టు తేలింది. మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. విశాఖ మారికవలస బ్రిడ్జి కింద కుళ్ళిపోయిన మృత దేహం గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హత్యగా దీనిని నిర్దిరించారు. పోలీసుల అదుపులో నిందితులు ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు విచారణలోకీలక విషయాలు వెలుగుచూశాయి. ఈ దారుణ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా భావిస్తున్నారు పోలీసులు. ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా చంపేస్తున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. వివాహేతర సంబంధాలకు మోజుపడి పచ్చని సంసారంలో వారికి వారే చిచ్చుపెట్టుకుంటున్నారు.
ఈమధ్యే ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ లో జరిగిన ఘటనే ఇప్పుడు వైజాగ్ లో చోటుచేసుకుంది. నీ భర్తని గుర్తు తెలియకుండా చంపేసి నా దగ్గరికి రా.. ఇద్దరం కలిసి హాయిగా జీవిస్తాం.. అంటూ ప్రియుడు అడిగితే ప్రియురాలు కాదనలేక భర్తను చంపేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈమధ్యే రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో భార్యామణి ప్రియుడి కోసం భర్తను చంపేసింది. దోపిడీ దొంగలు చంపినట్టుగా కథ అల్లింది. కానీ నిజం బయటపడకుండా వుంటుందా? వివాహేతర సంబంధాలు ఎలాంటి అకృత్యాలకైనా దారితీస్తాయి. ఓ పండ్ల వ్యాపారి హత్య కేసులోనూ ప్రధాన సూత్రధారి మృతుని అతని భార్య, ఆమె ప్రియుడేనని తేలింది. ఒకప్పుడు భర్త కోసం భార్య, ఇప్పుడు ప్రియుడు/ప్రియురాలు కోసం ఏదైనా చేసేస్తున్నారు. హత్యలు చేస్తే జైలుకెళతామనే లాజిక్ మిస్సవుతున్నారు.
Wife Planned Husbands Murder: భార్యామణి నిర్వాకం.. భర్త అడ్డు తొలగించే ప్లాన్