Vizag: విశాఖపట్నంలోని గోపాలపట్నం ఇందిరానగర్ లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై తప్పుడు కేసు పెట్టారన్న అవమానంతో ఆనంద్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. తన స్నేహితుడి పర్సు ఏడాది కిందట పోవడంతో అది గత రెండు రోజుల క్రితం ఆనంద్ కి దొరకడంతో ఆనంద్ తో పాటు మరో వ్యక్తిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో సోమేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.