Botsa Satyanarayana: వైఎస్ హయాంలోనే మేం ఐటీని ప్రోత్సహించాం..
- వైఎస్ హయాంలోనే మేం ఐటీని ప్రోత్సహించాం..
- విశాఖలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: వైఎస్ హయాంలోనే మేం ఐటీని ప్రోత్సహించామని తెలిపారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది.. సామాన్యుడి మనుగడ కష్టమైపోయింది.. మేము ఒత్తిడి చేస్తేనే హామీలు అమలు చేస్తున్నారు.. మా ఒత్తిడి వలనే రేపు అన్నదాత సుఖీభవ ఇస్తున్నారు.. పథకాలు ఒక సంవత్సరం ఎగ్గొట్టారు.. మా నాలుక మందం కాదు.. ప్రభుత్వ మెడలు వంచి పథకాలు ఇచ్చేలా చేస్తామని చెప్పాం అన్నారు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీనించాయి.. పోలీసులు అంటే ఎవరికీ భయం లేదు.. మాజీ మంత్రి పరామర్శకు జగన్ వెళ్తే జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు.. జగన్ పర్యటనకు జనం వస్తే టీడీపీ నేతలు ఎందుకు రగిలిపోతున్నారు..? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి రోజా కోసం ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు టీడీపీ నేతలు ఎందుకు ఖండించలేదు.. గతంలో ఎప్పుడూ విశాఖలో డ్రగ్స్ కల్చర్ లేదు.. ఈ ప్రభుత్వం వచ్చాకే డ్రగ్స్ కేసులు పెరగవు.. డ్రగ్స్ కేసు దర్యాప్తులో కమిషనర్ ముందు ఒకలా తరువాత మరోలా మాట్లాడారు.. విశాఖలో క్రైమ్ రేట్ లెక్కలు చూస్తే వాస్తవాలు బయటకు వస్తాయి.. పోలీసు వ్యవస్థను పని చెయ్యనివ్వడం లేదు అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
Read Also: Harish Rao: సాగునీటి ప్రాజెక్టుల పై లోకేష్ కు అవగాహన లేదు..
Also Read
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
లూలు సంస్థకు ఉద్యోగాల కోసం భూములు ఇస్తున్నారా..? లాలూఛీ పడి భూమి ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు బొత్స.. పబ్లిక్ గా వేలం వేసి భూమి కేటాయించవచ్చు కదా..? లూలు సంస్థకి భూమి కేటాయించడం చూస్తుంటే ప్రభుత్వ దోపిడీ కనిపిస్తుందన్నారు. టీసీఎస్ సంస్థలో ఉద్యోగాలు తీసేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.. విశాఖలో ఐటీని డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహించారని తెలిపారు.. P4 పేరుతో ఉద్యోగులను దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.. P4 విధివిదానాలు ఏమిటి..? ప్రజలకు సమాధానం చెప్పాలి కదా..? అని నిలదీశారు.. పరిపాలన చేతకాక మా మీద ఆరోపణలు చేస్తున్నారు.. తల్లికి వందనం ఎప్పుడైనా వాయిదా పద్ధతిలో ఇచ్చామా..? ఈ ప్రభుత్వం వాయిదా పద్దతిలో తల్లికి వందనం డబ్బులు వేస్తుంది.. ? అని ప్రశ్నించారు.. ఉచిత బస్సు కూడా మా ఒత్తిడి వలనే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దపడింది.. రూ.1.5 లక్షల కోట్లపైగా అప్పులు చేశారు.. మేము frbm లిమిట్ ప్రకారమే అప్పులు చేసాం.. ఆర్ధిక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్ళాం.. అందుకే ఈ ప్రభుత్వానికి అప్పులు పుడుతున్నాయి.. వీరి మొహం చూసి ఎవరైనా అప్పులు ఇస్తారా..? అని మండిపడ్డారు..
Read Also: Peddi: విజయనగరంలో చరణ్ పోరాటం
సింగపూర్ కంపెనీ వెళ్ళిపోతానని చెప్తే బ్యాలెన్స్ డబ్బులు కట్టమని అడిగాం.. తప్పేముంది..? అని ప్రశ్నించారు బొత్స.. రాజధాని నిర్మాణానికి స్క్వేర్ ఫీట్ కి రూ. 14-15 అవుతుంది.. దేశంలో ఏ ప్రాంతంలో ఇంత ఖర్చు అవ్వదు.. అందుకే కంపెనీలు ముందుకు రావడం లేదు.. ఇందులో ఇరుక్కుపోకూడదనే ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.. మా హయాంలో ఎప్పుడూ ఫీజు బకాయిలు లేవు.. ఈ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్ మెంట్ ఆపేసారు.. విద్యార్థుల మీద కోపం ఎందుకు..? వర్షాలు లేక భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందన్నారు.. రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు.. రైతులను ప్రభుత్వం లేదా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆదుకోవాలి.. రైతుల తరఫున ఇన్సూరెన్స్ మేము కట్టేవాళ్ళం.. ఇప్పుడు రైతులనే కట్టుకోవాలని ప్రభుత్వం చెప్తుంది.. రాష్ట్రంలో ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు.. మే 15 నుంచి ఉపాధి హామీ కూలీ డబ్బులు రాలేదు.. 75 రోజులుగా కూలీలకు డబ్బులు లేవు అని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!