Kajal Aggarwal: కారవాన్‌లోకి దూసుకొచ్చి షర్ట్ విప్పేశాడు.. కాజల్ చెప్పిన షాకింగ్ ఘటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggarwal: సెలబ్రిటీల జీవితాలు బయట నుంచి చూస్తే గ్లామర్‌తో నిండిపోయినట్లు కనిపిస్తాయి. అయితే కెమెరాల వెనుక వారు ఎదుర్కొనే అనుభవాలు మాత్రం చాలాసార్లు ఊహించని విధంగా ఉంటాయి. ముఖ్యంగా అభిమానుల పేరుతో కొందరు చేసే అతిగా ప్రవర్తించే చర్యలు వారిని అసౌకర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తనకు షూటింగ్ సమయంలో ఎదురైన ఒక షాకింగ్ ఘటనను వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది చిత్రసీమలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్, పెళ్లి తర్వాత కూడా విజయవంతంగా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ‘NBK111’, ‘రామాయణ’ వంటి భారీ ప్రాజెక్టుల్లో కూడా నటిస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎదురైన ఒక షాకింగ్ సంఘటనను ఆమె పంచుకున్నారు.
ఒక సినిమా షూటింగ్ పూర్తయ్యాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి తాను ఒంటరిగా కారవాన్‌లో ఉన్న సమయంలో అనూహ్యంగా ఒక వ్యక్తి అనుమతి లేకుండా లోపలికి వచ్చాడని కాజల్ తెలిపారు. అతను అదే సినిమా యూనిట్‌కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ అని తర్వాత తెలిసిందని చెప్పారు. తాను ఏమి జరుగుతోందో అర్థం చేసుకునేలోపే, అతను ఒక్కసారిగా తన షర్ట్ విప్పేశాడని గుర్తుచేసుకున్నారు. అంతలోనే అతను తన ఛాతీపై కాజల్ పేరు టాటూగా వేయించుకున్నట్లు చూపిస్తూ, తన అభిమానాన్ని వ్యక్తం చేశాడని ఆమె చెప్పారు. అయితే ఆ చర్య తనను తీవ్రంగా భయపెట్టిందని వెల్లడించారు. అభిమానిగా ప్రేమ చూపించడం తప్పు కాదని, కానీ ఒక మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో అనుమతి లేకుండా ప్రవేశించి అలా ప్రవర్తించడం ఏమాత్రం కరెక్ట్ కాదని కాజల్ స్పష్టం చేశారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఆ సమయంలో తాను అతనితో ప్రశాంతంగానే మాట్లాడానని, తన పేరుతో టాటూ వేయించుకున్నందుకు నటిగా సంతోషమే అయినా, పరిమితులను దాటే అభిమానం ఎవరినైనా అసౌకర్యానికి గురిచేస్తాయని ఆమె సూచించారు. కాజల్ వెల్లడించిన ఈ ఘటన మరోసారి సినీ ప్రముఖుల భద్రత, ముఖ్యంగా షూటింగ్ సెట్లలో హీరోయిన్ల ప్రైవసీపై చర్చకు దారితీసింది. అభిమానం ఎంత ఉన్నా అది హద్దుల్లోనే ఉండాలని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
- Tags
- cinema
- Kajal Aggarwal
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!