దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగభగమండిపోతున్నాడు. తీవ్రమైన వేడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. అంతగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అయితే తాజాగా భారత వాతావరణ శాఖ మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే నాలుగు రోజులు పాటు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను హెచ్చరిస్తూ లిస్టును విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: NBK 109: బాలయ్య-బాబీ సినిమా టైటిల్ ఇదే?
ఏప్రిల్ 3 నుంచి 6 వరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఏపీలో రాయలసీమ, కోస్తాంధ్రలో వేడి గాలులు ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది. రాత్రి వేళలో వేడితో పాటు తేమతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది. అయితే ఈశాన్య భారతదేశంలో ఏప్రిల్ 7 వరకు మెరుగైన వర్షపాతం, ఉరుములతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఒడిశాలో ఏప్రిల్ 3-6 మధ్య, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 4-6 మధ్య, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, కోస్తా, యానాంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఒడిశాలో మాత్రం రాత్రిపూట వెచ్చని పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Vizag: సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు.. ఆచూకీ కోసం గాలింపు
ఇక కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో వేడితో పాటు తేమ చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 2-4 మధ్య కాలంలో తెలంగాణలో కూడా వేడి వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది. రాబోయే 3 రోజుల్లో వాయువ్య మరియు తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 ° C వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2°C వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఏప్రిల్ నెలలో సాధారణం కంటే ఎక్కువగా వేడి వాతావరణం అధికంగా ఉండే ఛాన్సుందని హెచ్చరించింది. ఈ సంవత్సరం తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటామని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ వేడి పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం ఉందని.. అందుకు తగిన విధంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Atishi: లోక్‌సభ ఎన్నికల ముందు మరో నలుగురు ఆప్ నేతల అరెస్ట్..