Tata-BMW: జర్మన్ ఆటోమోటివ్ దిగ్గజం బీఎండబ్ల్యూ(BMW)తో టాటా టెక్నాలజీస్ జతకట్టింది. భారతదేశంలో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, ఐటీ డెవలప్మెంట్ హమ్ ఏర్పాుట చేయడానికి జాయింట్ వెంచర్‌ని ఏర్పాటు చేయనున్నట్లు ఈ రోజు తెలిపాయి. పూణె, బెంగళూరు, చెన్నైలలో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్ మరియు ఐటీ డెవలప్‌మెంట్ హబ్‌ను స్థాపించే లక్ష్యంతో జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటుకు రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయని కంపెనీల సంయుక్త ప్రకటన తెలిపింది.
మెయిన్ డెవలప్మెంట్, ఆపరేషన్ యాక్టవిటీస్ బెంగళూర్, పూణేలో ఏర్పాటు చేయబడనున్నాయి. చెన్నైలో బిజినెస్ ఐటీ సొల్యూషన్స్‌పై దృష్టి కేంద్రీకరించారు. బీఎండబ్ల్యూ ప్రీమియం వాహనాల కోసం సాఫ్ట్‌వేర్-డిఫైన్డ్ వెహికల్(SDV) సొల్యూషన్, బిజినెస్ ఐటీ కోసం డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్‌లతో సహా ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్లను ఈ జాయింట్ వెంచర్ అందిస్తుంది. 100 మంది ఇన్నోవేటర్స్‌తో కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. ఈ జాయింట్ వెంచర్ బీఎండబ్ల్యూ యెక్క గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ సాఫ్ట్‌వేర్, ఐటీ హబ్‌లలో భాగం అవుతుంది.
Read Also: Arvind Kejriwal: తీహార్ జైలులో కేజ్రీవాల్ ఇరుగుపొరుగుగా తీవ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు..
‘‘BMW గ్రూప్‌తో మా సహకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్ మరియు డిజిటల్ ఇంజనీరింగ్‌లో అగ్రశ్రేణి పరిష్కారాలను అందించడంలో మా నిబద్ధతను ప్రదర్శిస్తోంది’’ అని టాటా టెక్నాలజీస్ సీఈఓ, ఎండీ వారెన్ హారిస్ అన్నారు. ఇంజనీరింగ్ ప్రీమియం ఉత్పత్తుల్లో బీఎండబ్ల్యూ గ్రూపుకు కంపెనీ సహాయం చేస్తుందని, వారి కస్టమర్లకు గొప్ప డిజిటల్ అనుభవాలను అందిస్తుందని, బిజినెస్ ఐటీలో దాని డిజిటల్ ట్రాన్స్‌ఫర్మెషన్ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆయన చెప్పారు.
బీఎండబ్ల్యూ గ్రూప్ సాఫ్ట్‌వేర్ అండ్ ఈఈ అర్కిటెక్చర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ గ్రోట్ మాట్లాడుతూ.. టాటా టెక్నాలజీస్ సహకారంతో సాఫ్ట్వేర్-డిఫైన్ వాహనాల ప్రోగ్రాం మరింత వేగవంతమవుతుందని అన్నారు. భారతదేశం అత్యుత్తమ సాఫ్ట్వేర్ నైపుణ్యాలతో పెద్దసంఖ్యలో ప్రతిభావంతుల్ని కలిగి ఉంది, వారు తమ సాఫ్ట్వేర్ సామర్థ్యానికి దోహదం చేయగలరని అన్నారు.