MLC Botsa Satyanarayana: లడ్డూ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకండి.. విచారణ జరిపి చర్యలు తీసుకోండి..
- తిరుమల లడ్డూ ఇష్యూ్కు ఇక్కడితో ముగింపు పలకండి..
- రాజకీయ పార్టీలు.. మీడియాకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి..
- విచారణ జరిపించి నిజాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Botsa Satyanarayana: వివాదంగా మారిన తిరుమల లడ్డూ ఇష్యూ్కు ఇక్కడితో ముగింపు పలకాలని రాజకీయ పార్టీలను, మీడియాకు విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అయితే, విచారణ జరిపించి నిజాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుమల లడ్డూపై రాజకీయాలు చేయడం.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడం అభ్యంతరకరం అన్నారు.. ప్రజల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. అధికారంలో వున్న వాళ్లు విచారించి వాస్తవాలు బయట పెట్టాలి.. కానీ, ఆరోపణలు చేయడం సరైనది కాదు అన్నారు.. దేవుడితో రాజకీయాలు ఎవరు చేసిన తప్పే.. ఆరోపణలు చేస్తున్న వాళ్లు మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలన్నారు..
Also Read
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ఇక, వెజిటేబుల్ ఫ్యాట్ కలిసి నెయ్యిని ప్రసాదాలు తయారీకి వాడలేదని ఈవో చెబుతున్నారు.. కూటమి పార్టీలు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు బొత్స.. టీటీడీ తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడితే నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించడం సాధారణ ప్రక్రియ.. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయాంలోనూ పలు మార్లు ట్యాంకర్లు వెనక్కు పంపించింది నిజం కాదా..? అని ప్రశ్నించారు.. శాంతి భద్రతలు, 100రోజుల అభివృద్ధిపై జరగాల్సిన చర్చ.. భక్తుల మనోభావాలతో ముడిపడిన లడ్డూ చుట్టూ తిప్పడం అన్యాయం అన్నారు.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు అయిన బడ్జెట్ ఎందుకు పెట్టలేదు..? టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల్లో జరిగిన అప్పులుపై వివరాలు బహిర్గతం చేయండి అని డిమాండ్ చేశారు..
Read Also: Devara : జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు చంద్రబాబు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.
మరోవైపు.. సంక్షేమ పథకాలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారు అని విమర్శించారు ఎమ్మెల్సీ బొత్స.. వరదల కారణంగా చనిపోయిన వాళ్ల లెక్కలు చెప్పమంటే.. ప్రకాశం బ్యారేజ్ ధ్వంసం కోసం బోట్లు పంపించారని మాట్లాడుతున్నారు.. బోట్లు వ్యవహారంలో వాస్తవాలు మీ అంతరాత్మకు తెలియదా…? అని ప్రశ్నించారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూశాం.. కానీ, ప్రభుత్వ అసమర్థత కారణంగా చనిపోవడం మన రాష్ట్రంలోనే చూశాం అన్నారు.. నెయ్యిని ప్రసాదాల్లో వాడలేదని ఈవో చేసిన ప్రకటనకు ఏం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు.. స్వామి వారి ప్రసాదాల్లో అపచారం జరుగుతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. లేని పక్షంలో ఆరోపణలు చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.. కూటమిలో వున్న బీజేపీ కూడా ఆ దిశగా ఆలోచించాలి.. లడ్డూ ప్రసాదాలను సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
-
Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!