MLC Nagababu: ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ ర్యాంక్.. కీలక పదవిలో నియామకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Nagababu Gets Cabinet Rank: జనసేన ఎమ్మెల్సీ, సినీ నటుడు కొణిదెల నాగబాబుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పర్యావరణ, అటవీశాఖకు సంబంధించిన గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును ప్రభుత్వం నియమించింది. ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ కల్పించడంతో.. రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గతంలో నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయనను కీలక కమిటీకి చైర్మన్‌గా నియమిస్తూ కేబినెట్ హోదా ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నాగబాబు నియామకం నేపథ్యంలో శాసనమండలిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నాగబాబును పలకరించి కుశల ప్రశ్నలు అడిగారు. ఇద్దరు నేతలు కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు కుటుంబ సభ్యుల గురించి నాగబాబును అడిగి తెలుసుకున్నారు. ‘పిల్లలు బాగున్నారా?’ అంటూ త్రిమూర్తులు ప్రశ్నించగా.. నాగబాబు కూడా ఆయనతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. అలాగే నాగబాబు ఆరోగ్యం గురించి కూడా తోట త్రిమూర్తులు అడిగారు. రాజకీయంగా వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు శాసనమండలిలో ఆప్యాయంగా పలకరించుకోవడం అక్కడ ఆసక్తికరంగా మారింది.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..

తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!