Devara : జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు చంద్రబాబు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.
- సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున దేవర రిలీజ్
- టికెట్ ధరలు పెంచుకునేందుకు దరఖాస్తు చేసిన నిర్మాతలు
- ప్రత్యేక అనుమతులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలో కనిపించనున్నాడు. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన దేవరను అటు ఏపీ ఇటు తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కోరుతూ ఇరు ప్రభుత్వాలకు దరఖాస్తు చేసారు నిర్మాతలు.
Also Read : David Warner : పుష్ప – 2లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్..?
Also Read
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
- Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
- Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని అన్ని సినిమా థియేటర్లలో బాల్కనీ టికెట్ ధరలు రూ. 110కి, దిగువ క్లాస్ టికెట్ ధరలు రూ. 60 మేర పెంచుకుందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబరు 27 నుండి 9 రోజుల పాటు అనగా అక్టోబరు 5వరకు ప్రతిరోజు 5 స్పెషల్ షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే కేవలం 27 తేదీన ఒక్క రోజు మాత్రమే 6 షోలు ప్రదర్శించుకునేలా ఉత్త్వరులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మొదటి రోజు 6 షోస్ కు అనుమతులు రావడంతో డే – 1 కలెక్షన్స్ ఊహించిన దాని కంటే ఎక్కువ కనిపించేలా ఉంటుందని ట్రేడ్ అంచనా.
తాజావార్తలు
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!