iQOO 16లో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
- iQOO 16లో భారీ అప్‌గ్రేడ్స్ ఉండొచ్చని లీక్స్..
- 2K రిజల్యూషన్‌తో 165Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే
- ఏకంగా 8,500mAh భారీ బ్యాటరీ
- IP68, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO 16 Leaks: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫ్లాగ్షిప్ ఫోన్ల మధ్య పోటీ రోజురోజుకి మరింత పెరుగుతోంది. ఇందులో భాగంగానే iQOO నుండి రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 16పై భారీ అప్‌గ్రేడ్స్ చేస్తున్నట్లు సమాచారం. లీక్‌ల ప్రకారం.. ఈ ఫోన్లో 165Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, కొత్త కెమెరా డిజైన్, క్వాల్కామ్ తదుపరి తరం ఫ్లాగ్షిప్ చిప్సెట్, భారీ 8,500mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అయితే వీటిపై కంపెనీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
165Hz డిస్ప్లే:
ఓ ప్రముఖ సోర్స్ అందించిన లీకుల ప్రకారం.. iQOO 16లో 6.85 అంగుళాల శామ్సంగ్ ఫ్లాట్ డిస్ప్లే ఉండొచ్చు. ఇది 2K రిజల్యూషన్‌తో పాటు ఏకంగా 165Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం iQOO 15లో 144Hz రిఫ్రెష్ రేట్ ఉండగా.. కొత్త మోడల్లో దీనిని 165Hzకు పెంచనున్నట్లు తెలుస్తోంది. అధిక రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్, యానిమేషన్లు మరింత స్మూత్‌గా కనిపించనున్నాయి. ముఖ్యంగా గేమింగ్ సమయంలో దీని ప్రయోజనం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా 2K రిజల్యూషన్‌ను మాత్రం కొనసాగించే అవకాశం ఉంది.
Also Read
- Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Amazon Early Deals: కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎర్లీ డీల్స్ ఇవిగో
- Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
కొత్త కెమెరా డిజైన్:
డిస్ప్లేతో పాటు iQOO 16లో కెమెరా మాడ్యూల్ డిజైన్‌ను కూడా పూర్తిగా మార్చనున్నట్లు సమాచారం. కొత్తగా చిన్న కెమెరా మాడ్యూల్‌ను రూపొందిస్తున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఇది ఫోన్ వెనుక ఎడమవైపు పైభాగంలో ఉండొచ్చని తెలుస్తోంది. iQOO 15తో పోలిస్తే కెమెరా ఐలాండ్ డిజైన్లోనే ప్రధాన మార్పు కనిపించే అవకాశం ఉంది. ఫోన్ కార్నర్లు, బెజెల్స్‌లో స్వల్ప మార్పులు మాత్రమే ఉండొచ్చని సమాచారం. ప్రధాన కెమెరాగా 50MP ఓమ్నివిజన్ OV50Q సెన్సార్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. మిగిలిన రెండు కెమెరాల వివరాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు.
ఫ్లాగ్షిప్ చిప్సెట్:
పెర్ఫార్మెన్స్ విషయంలోనూ iQOO 16 భారీ అప్‌గ్రేడ్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లో క్వాల్కామ్ నెక్స్ట్ జెనరేషన్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ఉండొచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. ఈ చిప్‌లో క్వాల్కామ్ అభివృద్ధి చేసిన Oryon CPU ఆర్కిటెక్చర్, అధునాతన Adreno GPU ఉండే అవకాశం ఉంది. గేమింగ్, హెవీ టాస్కింగ్ కోసం ప్రత్యేక గ్రాఫిక్స్ చిప్‌ను కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన సూపర్ కంప్యూటింగ్ చిప్ Q4ను ఇందులో ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం.
భారీ బ్యాటరీ:
iQOO 16లో మరో అతిపెద్ద అప్‌గ్రేడ్ బ్యాటరీ. లీక్‌ల ప్రకారం ఈ ఫోన్లో ఏకంగా 8,500mAh బ్యాటరీ ఉండొచ్చు. దీనికి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించే అవకాశం ఉంది. ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఇంత భారీ బ్యాటరీ అందించడం కాస్త ఆశ్చర్యమే. ఇక సిమెట్రికల్ డ్యూయల్ స్పీకర్లు, X-Axis లీనియర్ మోటార్, ఇన్-డిస్ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఫోన్‌కు IP68, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు లభించే అవకాశం ఉంది. USB 3.2, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండొచ్చని సమాచారం.
ఫ్యాన్ లేకుండానే కూలింగ్.?
iQOO 16లో ఆసక్తికరమైన మార్పు కూలింగ్ వ్యవస్థకు సంబంధించినది. గతంలో గేమింగ్ ఫోన్లలో కనిపించే ఫ్యాన్ ఆధారిత కూలింగ్‌కు బదులుగా.. ఈ ఫోన్లో ప్రత్యేకమైన ఇంటర్నల్ కూలింగ్ టెక్నాలజీతో పాటు ప్రత్యేక గ్రాఫిక్స్ ప్రాసెసర్‌ను ఉపయోగించి వేడిని నియంత్రించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
భారత్‌లో లాంచ్..
iQOO 16 చైనాలో సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్ ప్రారంభం మధ్యలో లాంచ్ కావచ్చని లీక్‌లు చెబుతున్నాయి. అయితే కంపెనీ అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. భారత్‌లో ఈ ఫోన్ విడుదలపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. మెమరీ చిప్‌ల ధరలు పెరగడం కారణంగా iQOO 16 ధర రూ.85,000కు పైగా ఉండే అవకాశం ఉందని, దీంతో భారత్‌లో లాంచ్‌ను కంపెనీ పునరాలోచించవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. iQOO 15 భారత్‌లో తొలుత రూ.72,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత దీని ధర రూ.85,999కు పెరిగింది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?