ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీరింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విశాఖ రైల్వేజోన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. వాల్తేర్ డివిజన్‌ను విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి..దీనిని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకురానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. స్కిల్ ఇండియా కోసం రూ.8,800 కోట్లు, పీఎం కౌశల్ వికాస్ యోజన 4.0కి రూ.6000 కోట్లు, జన్ శిక్షణ్ సంస్థాన్‌కు రూ.858 కోట్లు విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Brazil: బ్రెజిల్‌లో బస్సును ఢీకొట్టిన చిన్న విమానం.. ఇద్దరు మృతి
స్కిల్ ఇండియా కార్యక్రమానికి మరో రూ.8,800 కోట్లు కేటాయించిదని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ‘‘ఈ కార్యక్రమాలు నిర్మాణాత్మక నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ శిక్షణ, సమాజ ఆధారిత అభ్యాసాన్ని అందించడం, అట్టడుగు వర్గాలతో సహా పట్టణ మరియు గ్రామీణ జనాభా రెండింటికీ అధిక నాణ్యత వృత్తి విద్యను పొందేలా చూడటం లక్ష్యంగా పెట్టుకున్నాయి’’ అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: India Alliance: ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఇండియా కూటమి పరిస్థితి ఏంటి?
అలాగే కొత్త ఐటీ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆరు దశాబ్దాల నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించిందని వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల మొదటి దశ ఫిబ్రవరి 13న ముగుస్తుంది. ఈ సమావేశాలు మార్చి 10న తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి.