ప్రజారోగ్య మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్)ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చాలాకాలంగా ప్రభుత్వ ఆమోదం కోసం మాజీ డీహెచ్ శ్రీనివాసరావు వేచి చూస్తుండగా.. ఈ క్రమంలో.. ఆయన వీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించింది.
కర్ణాటకలోని గిరిజనాభివృద్ధి సంస్థ నుంచి ప్రైవేటు బ్యాంకు ఖాతాల్లోకి భారీ మొత్తంలో నిధులను అక్రమంగా మళ్లించారనే ఆరోపణలతో ఆ రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, యువజన సాధికారత, క్రీడల శాఖ మంత్రి బి నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బెంగళూరులో పత్రాన్ని సమర్పించారు.
ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్‌ఐపీబీ) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోకి విస్తారంగా పెట్టుబడులు– పలు ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా.. ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులు – ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలకు ఆమోదం తెలిపింది.
మగవారి కోసం కొత్త రకం గర్భనిరోధక ఇంజెక్షన్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఇంజెక్షన్ సహాయంతో 99 శాతం గర్భాన్ని నివారించవచ్చని చెబుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఏడేళ్ల ఇంటెన్సివ్ రీసెర్చ్ తర్వాత ఈ ఇంజెక్షన్‌ను ఆమోదించారు. ఈ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా సులభమని.. దీని సక్సెస్ రేట్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది.
మనం వాడే దాదాపు అన్ని వస్తువులపై పన్నును విధిస్తున్నారు. వస్తువులపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్‌టీ) పేరుతో పన్నును విధిస్తున్న సంగతి తెలిసిందే.
అతి త్వరలోనే భారత్‌లోకి ఫైజర్ టీకా రానుంది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా కీలక ప్రకటన చేశారు. అత్యవసర వినియోగం కింద మరికొన్ని రోజుల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు ఆల్బర్ట్ బౌర్లా. ఇందుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ తుదిదశకు చేరుకుందని చెప్పారు. భారత్‌లో ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌లు వినియోగంలో ఉన్నప్పటికీ వ్యాక్సిన్‌ల కొరత వేధిస్తోంది. దీంతో విదేశీ టీకాలకు అనుమతి ఇవ్వడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని కేంద్రం భావిస్తోంది. read also…