ఆంధ్రప్రదేశ్‌కు షాక్ ఇచ్చింది రైల్వేశాఖ.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసిన కేంద్రం.. కొత్త మెలిక పెట్టింది. సెంటిమెంట్‌ను గౌరవించి 130 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేర్ డివిజన్ కొనసాగిస్తూనే.. కీలక మార్గాలలో కోత పెట్టింది. కార్గో, అరకు పర్యాటక అభివృద్ధికి కీలకమైన కొత్త వలస - కిరండోల్ మార్గం ఒడిషా పరిధిలోకి వెళ్ళిపోనుంది.
South Coastal Zone: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద మైలురాయిగా మరో కొత్త రైల్వే జోన్ ఏర్పాటయ్యింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఈ నిర్ణయంతో విశాఖపట్నం రైల్వే డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో భాగం చేశారు. ప్రస్తుతం ఉన్న వాల్తేర్ రైల్వే డివిజన్‌ను విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మారుస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు,…
Railway Zone: దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యాలయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్న ప్రకటనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. భవన నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్తయ్యిందని తెలిపారు. జోన్ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని అన్నారు.