Daggubati Purandeswari: ‘హమ్ సాత్ ఏక్ హై’ అనే నినాదంతో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు..
- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం
- ఈ సందర్భంగా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపిన పురందేశ్వరి
- జార్ఖండ్‌లో స్వల్ప మెజారిటీతో బీజేపీ కూటమి ప్రభుత్వం ఓటమికి గల కారణాలు సమీక్షిస్తాం
- మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు- పురందేశ్వరి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్వరి ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా భారత ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్‌లో స్వల్ప మెజారిటీతో బీజేపీ కూటమి ప్రభుత్వం ఓటమికి గల కారణాలు సమీక్షిస్తామన్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఓడిపోతుందని చాలామంది ఫలితాలకు ముందే చెప్పారు.. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని పురందేశ్వరి తెలిపారు.
Read Also: Adani Group: గౌతమ్ అదానీ, సమీప బంధువు సాగర్‌కి సమన్లు
Also Read
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
విభజించు.. పాలించు కులగణన చేసి పాలించు అనే కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీ నినాదానికి ప్రజలు స్వస్తి పలికారని పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి బీజేపీతో కలిసి నరేంద్ర మోడీ జీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందటమే కాకుండా సురక్షితంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు నమ్మి హమ్ సాత్ ఏక్ హై అనే నినాదంతో ఎన్డీఏ కూటమి విజయానికి పట్టం కట్టారని పురందేశ్వరి అన్నారు. ఎన్డీఏ కూటమి విజయానికి వేసిన ఓట్లు కాదు.. మహారాష్ట్ర అభివృద్ధికి ప్రజలు వేసిన ఓట్లు అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Priyanka Gandhi: పార్లమెంట్లో వయనాడ్ ప్రజల గొంతుకనవుతా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా… మ్యాజిక్ ఫిగర్ 145. మ్యాజిక్ ఫిగర్ ను ఎప్పుడో దాటేసిన మహాయుతి కూటమి 230 స్థానాల్లో విజయం ఖాయం చేసుకుంది. విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి 51 స్థానాల్లో ముందంజ వేసింది.
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!