PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- పీఓకే ప్రజలకు ఆహారం, మందులు అండకుండా చేస్తున్న పాకిస్తాన్..
- పీఓకేను దిగ్బంధించి, నిరసనల్ని అణచివేయాలనే ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK: పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో భారీగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాశ్మీర్ శరణార్థులకు 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించడంపై అక్కడి ప్రజలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం లేవనెత్తారు. ఈ నిర్ణయం ద్వారా పాక్ ప్రభుత్వం తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్లాన్ చేస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలు ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారాయి.
ఇదిలా ఉంటే, ఈ ఆందోళనల్ని అడ్డుకోవడానికి, ఉద్యమకారుల్ని అణచివేయడానికి పాకిస్తాన్ అనాగరిక చర్యలకు దిగుతోంది. పాక్ ఇతర ప్రాంతాల నుంచి పీఓకేకు సరకులు వెళ్లకుండా దిగ్బంధనం చేసింది. దీంతో ఆహారం, మందుల కోసం పీఓకే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నిరసనల నేపథ్యంలో పీఓకేలోని ముజఫరాబాద్, రావలాకోట్, బాగ్, నీలం వ్యాలీ ప్రాంతాల్లో ఆహారం, మందులు, ఇంధనం కొరత తీవ్రంగా పెరిగింది. అనేక దుకాణాలు, మెడికల్ షాపులు మూతపడగా, ప్రజలు రోజువారీ అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పిండి, బియ్యం, పప్పులు, పెట్రోల్ వంటి నిత్యావసర వస్తువులు కూడా దొరకడం లేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
పాకిస్తాన్ నుంచి వస్తున్న సరుకుల్ని పీఓకేకు చేరకముందే చెక్‌పోస్టుల వద్ద అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చాలా మంది ట్రక్ డ్రైవర్లు ఆహార పదార్థాలు, నిత్యావసరాలతో వెళ్లున్న వాహనాలను నిలిపేస్తున్నారు. దీంతో సరఫరా వ్యవస్థ దెబ్బతింది. అయితే, ఈ ఆరోపణల్ని పాక్ అధికారులు ఖండిస్తున్నారు. అవసరమైన వస్తువుల రవాణాను అడ్డుకోవడం లేదని చెప్పారు. మరోవైపు, ఉద్యమం రోజురోజుకు బలపడుతోంది. రావల్ కోట్లో భారీ ధర్నాకు 70,000 మంది హాజరయ్యారు. అవసరమైతే లక్ష మందితో ముజఫరాబాద్‌కు మార్చ్ చేపడుతామని ఉద్యమ నేతలు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!