AP Crime: డ్రగ్స్ కేసులో ఉన్నారని బెదిరింపులు.. మహిళా ఉద్యోగి నుంచి రూ.32 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
- మాదక ద్రవ్యాల కేసులో ఉన్నారంటూ బెదిరింపులు..
- మహిళా ఉద్యోగి నుంచి రూ. 32 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు..
- సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కిన బ్యాంకు ఉద్యోగి..
- టెలిగ్రామ్ యాప్ లింక్ ద్వారా టాస్క్‌లు ఇచ్చి రూ.13 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. బ్యాంకు వివరాలు, ఫోన్ నంబర్, పిన్ నంబర్లు రాబట్టి అందనికాడికి డబ్బులు దండుకోవడమే కాదు.. కొన్నిసార్లు మాయమాటలు, బెదిరింపులతో కూడా డబ్బులు కొట్టేస్తున్నారు.. తాజాగా, విజయవాడ పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది.. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. మాదక ద్రవ్యాల కేసులో ఉన్నారంటూ బెదిరించి.. ఓ మహిళా ఉద్యోగి నుంచి రూ. 32 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు.. బాధితురాలు విజయవాడ భవానీపురానికి చెందిన మహిళా ఉద్యోగి.. రెండు దఫాలుగా 32 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్లో వేశారు బాధిత మహిళ.. మీ పేరుతో కొరియర్ వచ్చిందని.. అందులో మాదక ద్రవ్యాలు, పాస్ పోర్ట్, 35 వేలు నగదు ఉన్నాయని సైబర్ నేరగాళ్ల ఫోన్ చేశారు.. ముంబై నుంచి సైబర్ సీఐ మాట్లాడుతున్నట్టు మహిళకు పదే పదే ఫోన్ చేయటంతో భయపడి ఆమె.. రూ.32 లక్షలు వారు చెప్పిన ఖాతాలో వేశారు.. ఆ తర్వాత ఇదంతా ఫేక్ అని గుర్తించిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Read Also: Rambha: ఒకప్పుడు కుర్రాళ్ళ కలల హీరోయిన్ రంభ.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్‌షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
మరోవైపు గుంటూరులో మరో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది.. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నాడు బ్యాంకు ఉద్యోగి హేమంత్ కుమార్.. టెలిగ్రామ్ యాప్ లింక్ ద్వారా టాస్క్‌లు ఇచ్చి.. రేటింగ్ పూర్తి చేస్తే డబ్బులు జమ చేస్తామంటూ వలవేశారు ఆన్లైన్ మోసగాళ్లు.. అది గ్రహించని సదరు బ్యాంకు ఉద్యోగి.. మోసగాళ్లు మాటలు నమ్మి రూ.13 లక్షల పోగొట్టుకున్నాడు.. ఆ తర్వాత.. మోసపోయానంటూ అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ఇలా పలు రకాలుగా మోసాలకు తెరలేపుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు కేటుగాళ్లు. వారితో జాగ్రత్తగా ఉండాలని.. ఆన్లైన్లో ఎవరిని పడితే వారిని నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తు్న్నారు.
తాజావార్తలు
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!