USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
- అమెరికాలో ఏపీ టెక్కీ మృతి..
- కారు ప్రమాదంలో మరణించిన దిలీప్ కుమార్..
- ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే విషాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దిలీప్ కుమార్ బుంగటావుల మృతి చెందారు. ఎదురుగా వస్తున్న పికప్ ట్రక్, ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దిలీప్‌ది కడప జిల్లా బెట్టివారిపట్టి గ్రామం. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆయన అక్కడి కెంట్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓహియో రాష్ట్రంలోని మాసిడోనియా ప్రాంతంలో ఇంటర్ స్టేట్ 480 రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. దిలీప్ కుమార్ ప్రయాణిస్తున్న సెడాన్ కారును అదే సమయంలో ఎదురుగా వస్తున్న పికప్ ట్రక్ ఢీకొట్టింది. ప్రమాదం గురించి తెలుసుకున్నా ఎమర్జెన్సీ సేవల బృందం ప్రమాదస్థలికి చేరుకునేలోపే దిలీప్ మరణించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై యూఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
దిలీప్ కుమార్ మృతిని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ధ్రువీకరించింది. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా సాయం అందిస్తామని ప్రకటించింది. మరోవైపు, దిలీప్ కుమార్ కుటుంబానికి సాయం చేయడానికి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నిధులు సేకరిస్తోంది. దిలీప్ తండ్రి శ్రీహరి సాధారణ రైతు. దిలీప్ కుమార్ ఇటీవలే తన మాస్టర్స్ పూర్తి చేసి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!