ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ఈరోజు ( అక్టోబర్ 4న) ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు.
Auto Driver Seva: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఈ సందర్భంగా మరో కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. రాష్ట్రంలోని డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో...’ పథకానికి శ్రీకారం చుట్టింది.