విశాఖ:- 2024 నాటికి టీడీపీ పార్టీ ఖాళీ అవుతుందని… ఆ పార్టీ అంతర్ధానం అయిపోతుందని వైసీపీ ఎండీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నాయకులు మాతో టచ్ లో వున్నారు..చర్చలు జరుగుతున్నాయన్నారు. పనితీరు ఆధారంగా అందరికీ సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీ నుంచి విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో ముఖ్య నాయకులు చేరారు.
గతంలో టిక్కెట్లు ఆశించి పార్టీ నుంచి బయటకు వెళ్లిన నాయకులను తిరిగి అహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయి… వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళు వస్తారు…టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. గతంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని అభివృద్ధి వైసీపీతోనే సాధ్యం అయిందన్నారు. అన్ని కులాలు, ఉప కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు.