గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటీ కృష్ణబాబు. పేషెంట్లను అడిగి వైద్యం అందుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు మంత్రి విడదల రజిని, కృష్ణ బాబు. ప్రతి డిపార్ట్మెంట్ ని పరిశీలించిన మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు.
అత్యవసర విభాగంలో ఏసీ పని చేయకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి విడదల రజిని. అత్యవసర విభాగంలో ఏసీ పనిచేయకపోవడంపై ఏఈని వివరణ అడిగారు మంత్రి రజిని. ఆరు నెలలు నుండి ఏసీ పని చేయకపోతే ఎందుకు చర్యలు తీసుకోలేందంటూ ప్రశ్నించారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు. ఎప్పటికప్పుడు రిపేర్ బిల్ల్స్ ఇస్తున్నా ఎందుకు బాగు చేయలేదన్నారు కృష్ణబాబు.
Read Also: TS Inter Exams 2022: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్
విధుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎందుకు లేరన్న జీజీహెచ్ లో ఉన్నతాధికారులను ప్రశ్నించారు మంత్రి విడదల రజిని. పీజీలు మాత్రమే విధుల్లో ఉన్నారని అధికారులు వివరించారు. వారితోనే నడిపిస్తున్నారా అని ప్రశ్నించారు మంత్రి రజిని. ఈసారి విజిట్ కి వచ్చినప్పుడు అన్నీ సక్రమంగా ఉండాలంటూ అధికారులను ఆదేశించారు మంత్రి రజిని, కృష్ణ బాబులు.