GBS Virus In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 17 గులియన్ బర్రె సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆరు జిల్లాల్లో ఈ జీబీఎస్ కేసులు నమోదు అయినట్టు గుర్తించారు.
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటీ కృష్ణబాబు. పేషెంట్లను అడిగి వైద్యం అందుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు మంత్రి విడదల రజిని, కృష్ణ బాబు. ప్రతి డిపార్ట్మెంట్ ని పరిశీలించిన మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. అత్యవసర విభాగంలో ఏసీ పని చేయకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి విడదల రజిని. అత్యవసర విభాగంలో ఏసీ పనిచేయకపోవడంపై ఏఈని…
ఇండియాలో కరోనా కేసుల్లో భారీ తగ్గుదల నమోదైంది. అయితే గతంలో పోలిస్తే మరణాలు బాగా తగ్గాయి. గత 24 గంటల్లో 1,270 పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. కరోనా కారణంగా 31 మంది మరణించారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,859గా నమోదైంది. గత 24 గంటల్లో 4,32,389 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… కొత్తగా 1,270 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే…
తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య హోరాహోరీ మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. మంత్రి హరీష్ రావు సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీ నేతల్ని చెడుగుడు ఆడేస్తుంటారు. కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. 317 జీవో రద్దు అంటే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దు అన్నట్టే అన్నారు మంత్రి హరీష్ రావు. జిల్లాల్లో స్థానికులకు ఉద్యోగాలు దక్కుతాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 317 జీఓ వచ్చింది. ఎవరి మీద పోరాటం చేస్తున్నారో బీజేపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే…
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఐర్లాండ్ నుంచి ముంబాయి మీదుగా విశాఖకు వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్ వైరస్ సంక్రమించింది. విజయనగరం జిల్లాలో రెండు దఫాలుగా ఆర్టీపీసీఆర్ పరీక్షలో కోవిడ్ పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్ సీసీఎమ్బీకి శాంపిల్స్ పంపారు అధికారులు. జీనోమ్ సీక్వెన్స్ లో ఒమిక్రాన్ గా నిర్ధారణ అయిందని తెలుస్తోంది. అయితే ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవని స్పష్టం చేసింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. దీంతో అలెర్ట్ అయింది…
ఒకవైపు కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ భయపెడుతోంది. ఒమిక్రాన్ కోరలు చాస్తోంది. అయినా జనంలో మార్పు రావడం లేదు. మాస్క్ మరిచిపోయారు. శానిటైజర్ దూరం పెట్టేశారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. అయితే కొందరు తమ వైఖరి మార్చుకోవడం లేదు. వ్యాక్సిన్ వేస్తాం రమ్మంటే దూరంగా వెళ్ళిపోతున్నారు. READ ALSO ఈ బామ్మలు సమ్‌థింగ్ స్పెషల్.. ఎందుకో తెలుసా? తాజాగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలో ఆరోగ్య సిబ్బందికి వింత అనుభవం…
దేశవ్యాప్తంగా మహమ్మారి టీబీ అదుపులో వున్నా.. డెంగ్యూ మాత్రం తన ప్రతాపం చూపుతూనే వుంది. కేంద్రం టీబీ, డెంగ్యూలకు వ్యాక్సిన్ల ను తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిచ్చారు. అమెరికాలో 9 నుంచి 16 ఏళ్ళ మధ్య పిల్లల కోసం డెంగ్యూ వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో కూడా డెంగ్యూ నివారణకు ఈ తరహా వాక్సిన్ తీసుకువచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా అని ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు…