గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటీ కృష్ణబాబు. పేషెంట్లను అడిగి వైద్యం అందుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు మంత్రి విడదల రజిని, కృష్ణ బాబు. ప్రతి డిపార్ట్మెంట్ ని పరిశీలించిన మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. అత్యవసర విభాగంలో ఏసీ పని చేయకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి విడదల రజిని. అత్యవసర విభాగంలో ఏసీ పనిచేయకపోవడంపై ఏఈని…