ఈ రోజు గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఓ ఎనిమిదేళ్ల బాలుడు ప్రత్యక్షమయ్యారు.. స్కూల్ బ్యాగ్ వేసుకునని.. చేతిలో ఓ ఫిర్యాదు పేపర్ పట్టుకుని కలెక్టరేట్‌లో నిర్వహిస్తోన్న గ్రీవెన్స్‌కు వచ్చాడు.. అయితే, ఆ బాలుడిని చూసి అంతా షాక్ అయ్యారు.. ఆ బుడతడికి వచ్చిన కష్టమేంటి? కలెక్టర్ దగ్గరకు ఎందుకు వచ్చాడు అనే రకరకాల ప్రశ్నలు వారి బుర్రల్లో మెదిలాయి..
Kakinada Crime: జీవితంపై విసుగుచెంది కొందరు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ మరికొందరు.. ఇతర సమస్యలు ఎంతో మంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు చూస్తూనే ఉంటాం.. ఒకసారి ప్రాణాలతో బయటపడ్డారంటే.. మళ్లీ అలాంటి ప్రయత్నాలు చేసిన ఘటనలు చాలా తక్కువే ఉంటాయి.. కానీ, కాకినాడలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ.. చావలేదని ఆస్పత్రి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.. జీజీహెచ్ ఓపీ బ్లాక్‌పై నుంచి దూకు ప్రాణాలు తీసుకుంది సదరు మహిళ.. Read Also:…
కాకినాడలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనుమానస్పదంగా మృతి చెందడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటన జరిగి 48 గంటలు దాటిపోవస్తున్నా ఇంకా పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. సుబ్రహ్మణ్యం హత్య పట్ల కాకినాడ పట్టణంలో పలు పార్టీలకు చెందిన నాయకులు నిరసన తెలియజేస్తున్నారు. టీడీపీ నిజనిర్దారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నిజనిర్దారణ కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి పితాని…
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటీ కృష్ణబాబు. పేషెంట్లను అడిగి వైద్యం అందుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు మంత్రి విడదల రజిని, కృష్ణ బాబు. ప్రతి డిపార్ట్మెంట్ ని పరిశీలించిన మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. అత్యవసర విభాగంలో ఏసీ పని చేయకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి విడదల రజిని. అత్యవసర విభాగంలో ఏసీ పనిచేయకపోవడంపై ఏఈని…
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా వైద్యులకు, వైద్యసిబ్బందికి జనవరి 10 నుంచి బూస్టర్ డోసులు అందిస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు వైద్యులు, వైద్యసిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా విజయవాడలోని జీజీహెచ్‌లో కరోనా కలకలం రేగింది. జీజీహెచ్‌లో 50 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. 20 మంది జూనియర్ వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు.…
గుంటూరు జీజీహెచ్‌లో అదృశ్యమైన మూడు రోజుల శిశుశు ఆచూకీ లభ్యమైంది.. బాలుడిని స్వాధీనం చేసుకున్న కొత్తపేట పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించిన నిందితులే.. బాలుడిని అపహరించినట్టు నిర్ధారణకు వచ్చిన కొత్తపేట పోలీసులు.. రంగంలోకి దిగి వారిని ట్రాక్ చేసి పట్టుకున్నారు.. నిందితులు హేమవరుణ్, పద్మలు నెహ్రునగర్ కు చెందిన వారిగా గుర్తించారు.. హేమవరుణ్ గతంలో జీజీహెచ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేశారని చెబుతున్నారు.. ఇక, ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన…
గుంటూరు.. జీజీహెచ్‌లో మూడు రోజుల శిశువు అపహరణకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది… ఈ నెల 12న కాన్పుకోసం పెదకాకానికి చెందిన ప్రియాంక అనే గర్భిణి చేరారు.. 13వ తేదీన మగ శిశువుకు జన్మనించారు.. అయితే, శుక్రవారం రాత్రి పసివాడు ఏడుస్తుండడంతో బయటకు తీసుకెళ్లింది.. ఆ శిశువు నాయనమ్మ… ఇక, బాత్రూంకు వెళ్తూ అక్కడే నిద్రపోతున్న అమ్మమ్మ పార్వతమ్మ పక్కన శిశువును వదిలి వెళ్లింది నాయనమ్మ.. కానీ, ఐదు నిమిషాల్లోనే తిరిగి వచ్చే సరికి శిశువును అపహరణకు…
నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ ఆడియో టేపు లీక్ కావడం పెద్ద కలకలమే సృష్టించింది.. ఆస్పత్రిలో మహిళా డాక్టర్లను, జూనియర్ డాక్టర్లను, సిబ్బందిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తారనే ఆరోపణలు వచ్చాయి.. ఓ విద్యార్థిని ఆయనకు ఫోస్ చేసి.. నన్ను నీ రూమ్‌కి రమ్మంటావా? లేకపోతే కాళ్లు చేతులు కట్టి, ప్లాస్టర్ వేసి తీసుకుపోతానంటావా? అడిగితే ఇదంతా కామన్ అంటావా? అంటూ చెడమా వాయింది.. నా స్థానంలో నీ కూతురు ఉంటే పరిస్థితి ఏంటి? అంటూ నిలదీసింది.. ఇక,…
నెల్లూరు జీజీహెచ్‌లో ఉన్నతస్థానంలో ఉన్న ఓ వైద్యుడు.. తన కామ వాంఛ తీర్చాలంటూ మహిళా హౌజ్ సర్జన్లు, డాక్టర్లతో పాటు మహిళా సిబ్బందిని వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.. కారులో ఒంటరిగా రావాలని, తనతో ఒంటరిగా గడపాలని.. బెదిరింపులకు దిగుతారట.. ఓ హౌజ్ సర్జన్ ఆయనతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.. నా రూమ్ లో ఏసీ ఉంది వచ్చేయ్ అని అంటావా..? రాకపోతే కాళ్లూ చేతులూ కట్టేసి నోటికి ప్లాస్టర్…