కర్నూలు జిల్లా కోసిగిలో విషాదం చోటు చేసుకుంది. నేరేడు పండ్లు తిని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కోసిగి మూడోవార్డులో నాలుగు రోజుల క్రితం బూగేని మాదేవి అనే మహిళ తన అత్త తెచ్చిన నేరేడు పండ్లను తన ఇద్దరు చిన్నారులు హర్ష, అంజిలకు ఇచ్చింది. వాళ్లతో పాటు ఆడుకుంటున్న మరో బాలుడు శ్రీరాములు కూడా ఆ పండ్లను తీసుకుని తిన్నాడు. కొన్ని పండ్లను చిన్నారుల తల్లి…